
ప్రెగ్నెన్సీ టైంలో బరువు పెరగడం మామూలే. అయితే కాన్పు తర్వాత తిరిగి మునుపటి బరువుకి రావడం కష్టం. ఈ విషయంలో కొందరు బాలీవుడ్ సెలబ్రిటీ మదర్స్ మిగతా తల్లులకు ఇన్స్పిరేషన్. రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయడం, హెల్దీఫుడ్ తినడం ద్వారా బరువు తగ్గొచ్చు అంటున్నారు.
ఈ ఏడాది మొదట్లో రెండో బిడ్డకు జన్మనిచ్చింది కరీనా కపూర్. ప్రెగ్నెన్సీ టైంలో బరువు పెరిగింది. అయితే మూడు నెలల్లోనే మామూలు బరువుకి వచ్చింది. రోజూ ప్లాన్ ప్రకారం వర్కవుట్స్ చేసేది. ‘రెగ్యులర్‌గా ‘ఏరియల్ సిల్క్ యోగ’ చేశా. ఈ యోగతో బాడీ ఫ్లెక్సిబుల్ అవుతుంది. బాడీ పోశ్చర్ బాగుంటుంది’ అని చెప్పింది.
శిల్పాశెట్టి కాన్పు అయిన 3 నెలల్లోనే 21 కిలోలు తగ్గింది. అందుకోసం రోజూ 20 నిమిషాల వర్కవుట్స్‌లో భాగంగా వాకింగ్, మెట్లు ఎక్కి దిగడం, యోగ చేసేది. పండ్లు, కూరగాయలు ఉన్న హెల్దీఫుడ్ తినేది.
బాలీవుడ్ క్వీన్‌గా పేరు తెచ్చుకున్న ఐశ్వర్యరాయ్ రెగ్యులర్‌గా పవర్ యోగా చేసేది. బ్రిస్క్ వాక్ , జాగింగ్ చేసి బాడీని మునుపటి షేప్‌లోకి తెచ్చుకుంది.
సమీరా రెడ్డి తన వెయిట్‌లాస్ జర్నీని ఎప్పటికప్పుడు ఇన్‌స్టాలో పంచుకుంటూ ఉంటుంది. ప్రెగ్నెన్సీ తర్వాత బరువు తగ్గడం కోసం ‘ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్’ చేసింది. 92 కిలోల నుంచి 82 కిలోలకి వచ్చింది. అంతేకాదు యోగ, ఇతర ఎక్సర్సైజ్లు కూడా చేసేది.