డాన్స్​తో బరువు కూడా తగ్గొచ్చు

డాన్స్​తో బరువు కూడా తగ్గొచ్చు

డాన్స్‌‌‌‌ చేయడాన్ని ఒక కళగానే కాదు, ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ ఎక్సర్‌‌‌‌‌‌‌‌సైజ్‌‌‌‌గా కూడా చూడొచ్చు. అందుకే ఈ మధ్య బరువు తగ్గడం కోసమని చాలామంది డాన్స్‌‌‌‌ క్లాస్‌‌‌‌లకు వెళ్తున్నారు. డాన్స్‌‌‌‌ చేయడం వల్ల శరీరంలోని ప్రతీ పార్ట్‌‌‌‌ ఎక్సర్‌‌‌‌‌‌‌‌సైజ్‌‌‌‌ చేసినట్టు అవుతుంది. దాంతో కొవ్వు కరుగుతుంది అని ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ ఎక్స్‌‌‌‌పర్ట్‌‌‌‌ గ్జావనా దియాస్‌‌‌‌ అంటుంది.

  • యాబై నిమిషాలపాటు డాన్స్‌‌‌‌ ఎక్సర్‌‌‌‌‌‌‌‌సైజ్‌‌‌‌ చేస్తే, దాదాపు 300 నుంచి 400 కేలరీలు కరుగుతాయి. అంటే ఇది హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్‌‌‌‌ ట్రెయినింగ్‌‌‌‌ లాంటిదన్నమాట. అంటే... ట్రెడ్‌‌‌‌మిల్‌‌‌‌ రన్నింగ్‌‌‌‌, డంబెల్‌‌‌‌ లిఫ్టింగ్‌‌‌‌, స్విమ్మింగ్‌‌‌‌, సైక్లింగ్‌‌‌‌ కలిపి ఉండే కార్డియోవాస్కులర్‌‌‌‌ ఎండురెన్స్‌‌‌‌ వర్కవుట్‌‌‌‌తో సమానం.‌‌‌‌ 
  • పని వల్ల ఒత్తిడి పెరుగుతుంది. దాన్ని తగ్గించి మళ్లీ మామూలు మూడ్‌‌‌‌కు రావాలంటే మంచి మ్యూజిక్‌‌‌‌తో పాటు, డాన్స్‌‌‌‌ కూడా హెల్ప్‌‌‌‌ అవుతుంది. అంటే డాన్స్‌‌‌‌ వల్ల మెంటల్‌‌‌‌ హెల్త్‌‌‌‌ కూడా బాగుపడుతుంది.
  •  పాటకు తగ్గట్టు  స్టెప్ప్‌‌‌‌ వేయాలనో లేదంటే ఫలానాలాగే చేయాలనో ఏం లేదు. ఎలా చేసినా బాడీ మొత్తం కదలాలి. చెమట పట్టాలి.  కండలు, సిక్స్‌‌‌‌ప్యాక్‌‌‌‌ కోసం స్పెషల్‌‌‌‌గా చేసే ఎక్సర్‌‌‌‌‌‌‌‌సైజ్‌‌‌‌లే కాకుండా డాన్స్‌‌‌‌తో కూడా వాటిని పెంచుకోవచ్చు. డాన్స్‌‌‌‌ వల్ల శరీరం ఫ్లెక్సిబుల్‌‌‌‌గా తయారవుతుంది. యాక్టివ్‌‌‌‌గా ఉంటారు.