నేషనల్ గేమ్స్లో మీరాబాయి చానుకు స్వర్ణం

నేషనల్ గేమ్స్లో మీరాబాయి చానుకు స్వర్ణం

గుజరాత్ గాంధీనగర్లో జరుగుతున్న 36వ జాతీయ క్రీడల్లో భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను స్వర్ణ పతకాన్ని సాధించింది. మహిళల 49 కేజీల విభాగంలో మీరాబాయి అగ్రస్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ దక్కించుకుంది. మొత్తం 191 కేజీలు ఎత్తి పసిడి పతకాన్ని  కైవసం చేసుకుంది.


 
స్నాచ్‌ ఈవెంట్ లో 84 కేజీలు ఎత్తిన మీరాబాయి చాను.. క్లీన్ అండ్ జెర్క్‌లో 107 కేజీలు ఎత్తి పోడియం టాప్ లో నిలిచింది. మీరాబాయి ఫస్ట్ ఎటెంప్ట్ లోనే 81 కేజీలు ఎత్తగా..రెండవ ప్రయత్నంలో 84 కిలోలు లిఫ్ట్ చేసింది. అటు సంచిచా మొదటి ప్రయత్నంలో 80 కిలోలు ఎత్తగా..రెండో ప్రయత్నంలో 82 కిలోలు లిఫ్ట్ చేసింది. ఇక  క్లీన్ అండ్ జెర్క్‌లో సంచిత ఫస్ట్ ప్రయత్నంలో  95 కేజీలు, రెండో ప్రయత్నంలో 100 కేజీలు , చివరి ప్రయత్నంలో 105 కేజీలను మాత్రమే  విజయవంతంగా ఎత్తింది.  కానీ మీరాబాయి యొక్క అత్యుత్తమ లిఫ్ట్ 107 కేజీలను మాత్రం దాటలేకపోయింది.