మేం ఏ పార్టీకి సపోర్ట్ చేయబోం

మేం ఏ పార్టీకి సపోర్ట్ చేయబోం

ప్రయాగ్ రాజ్: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ టికాయత్ ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రీయ లోక్ దళ్, సమాజ్ వాదీ పార్టీ కూటమికి మద్దతు ఇవ్వాలని బీకేయూ చీఫ్ నరేశ్ టికాయత్  విజ్ఞప్తి చేశారు. అయితే సిసౌలిలో బీజేపి నేత సంజీవ్ బిల్యాన్ తో నరేశ్ టికాయత్ సమావేశమైన కొన్ని గంటల తర్వాత తన ప్రకటనను ఉపసంహరించుకున్నారు. తాను ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని చెప్పారు. ఈ క్రమంలో చింతన్ శివిర్ కు వచ్చిన రాకేశ్ టికాయత్ రైతు సమస్యలపై మూడు రోజుల పాటు చర్చించనున్నారు. అన్నదాతలకు  కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపించారు.

రైతుల ఆందోళన సమయంలో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిందని.. కానీ అది జరగలేదని తికాయత్ అన్నారు. లఖింపూర్ ఖేరీ ఘటనలో చాలా మందిని జైలుకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రాను పదవి నుంచి తొలగించకుండా ఇంకా కొనసాగిస్తున్నారని చెప్పారు. ధాన్యం సేకరణలోనూ కొన్ని సమస్యలు ఉన్నాయన్నారు. ఇలాంటి అంశాలపై చర్చించి కేంద్రం తగిన నిర్ణయం తీసుకోవాలని రాకేశ్ టికాయత్ కోరారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి అన్నదాతలు దాదాపు 13 నెలలు ఆందోళన చేసి విజయం సాధించారు. కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలు వాటి  గురించి ఆలోచించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తల కోసం: 

బీజేపీలోకి ములాయం కోడలు

టీనేజర్లకు కొవాగ్జిన్ మాత్రమే ఇవ్వాలె

తెలంగాణ సీఈవో శశాంక్ గోయల్ బదిలీ