మేడ్చల్ లో వెల్​ విషర్స్ హాస్పిటల్ లైసెన్స్ రద్దు

మేడ్చల్ లో వెల్​ విషర్స్ హాస్పిటల్ లైసెన్స్ రద్దు
  • రెండు క్లినిక్స్ సీజ్

మేడిపల్లి, వెలుగు: మేడ్చల్ లో ​పరిధిలోని ఓ ప్రైవేట్​హాస్పిటల్​లో అర్హత లేకుండా ట్రీట్​మెంట్​చేస్తున్నారని గుర్తించిన వైద్యాధికారులు దవాఖాన లైసెన్స్ రద్దు చేశారు. మేడ్చల్ డీఎంహెచ్ఓ డాక్టర్ ఉమాగౌరి మాట్లాడుతూ బోడుప్పల్ వెల్ విషర్స్​హాస్పిటల్ డాక్టర్​గౌతమి రెండేండ్లుగా అందుబాటులో లేరని, దీంతో ఫార్మాసిస్ట్ ట్రీట్​మెంట్​ఇస్తున్నారని తేలిందన్నారు. ఆ హాస్పిటల్​లైసెన్సు రద్దు చేశామని, అలాగే రూల్స్​బ్రేక్​చేసిన రక్షిత్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్, పల్స్ క్లినిక్ ను సీజ్ చేశామన్నారు.