సీఎం కారు సడెన్ బ్రేక్.. దీదీ తలకు చిన్న గాయం

సీఎం కారు సడెన్ బ్రేక్.. దీదీ తలకు చిన్న గాయం

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ .. కారు ప్రమాదానికి గురయ్యారు. బర్ధమాన్‌ నుంచి కోల్‌కతా వైపు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరగడంతో ఆమె తలకు గాయాలైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పొగమంచు కారణంగా రోడ్డు సరిగా కనిపించకపోవడంతో కారు అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నాయి.

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. బర్ధమాన్‌ ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి కోల్‌కతాకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం మేరకు పొగమంచు ఎక్కువగా ఉండడంతో సరైన విజిబిలిటీ లేకపోవడంతో కాన్వాయ్‌లోని ముందున్న వాహనానికి సీఎం కూర్చున్న వాహనం దగ్గర వరకు వెళ్లడంతో డ్రైవర్‌ సడెన్‌గా బ్రేకులు వేయడంతో ప్రమాదం జరిగింది.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించడం కోసం తూర్పు బర్ధమాన్ వెళ్లారు. సమీక్ష అనంతరం అక్కడనుండి వాయు మార్గంలో ఆమె కలకత్తా రావాల్సి ఉండగా వాతావరణ అనుకూలించకపోవడంతో రోడ్డు మార్గం నుంచి ప్రయాణం చేశారు. అక్కడ వర్షం కురుస్తున్న క్రమంలో హెలికాఫ్టర్ ప్రయాణం చేసేందుకు వీలు లేకపోవటంతో రోడ్డు మార్గాన బయలుదేరారు.

వర్షం తో పాటు పొగ మంచు ఎక్కువగా ఉండడంతో రహదారి మార్గంలో కూడా వాహనాలు దగ్గరకు వచ్చేవరకు కనిపించని పరిస్థితులలో ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. దట్టమైన పొగ మంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో మమతా బెనర్జీ వాహన డ్రైవర్ సడన్ గా కారుకు బ్రేకులు వేశాడు. దీంతో ముందు సీట్లో కూర్చున్న సీఎం తలకు, చేయికి స్వల్ప గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.