
కేంద్ర ప్రభుత్వానికి 30 వేల కోట్లు పెద్ద విషయం కాదన్నారు వెస్ట్ బెంగాల్ సీఎం మమత బెనర్జీ. దేశవ్యాప్తంగా అందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వానికి బెంగాల్ పై ఇంత వివక్ష ఎందుకని ప్రశ్నించారు. ఇవాళ జరిగిన స్పెషల్ అసెంబ్లీ సెషన్ లో మమత మాట్లాడారు. సీఎంగా ప్రమాణం చేసిన 24 గంటల్లోనే రాష్ట్రానికి కేంద్ర బలగాలను పంపించాల్సిన అవసరం ఏముందన్నారు. ప్రజల తీర్పును అంగీకరించేందుకు బీజేపీ నేతలు సిద్ధంగా లేరని మమత విమర్శించారు. బీజేపీ నేతలు ఫేక్ న్యూస్, ఫేక్ వీడియోలు స్ప్రెడ్ చేస్తున్నారని ఆరోపించారు.