Bernard Julien: వెస్టిండీస్ క్రికెట్‌లో విషాదం.. 75 సంవత్సరాల వయసులో వరల్డ్ కప్ విజేత కన్నుమూత

Bernard Julien: వెస్టిండీస్ క్రికెట్‌లో విషాదం.. 75 సంవత్సరాల వయసులో వరల్డ్ కప్ విజేత కన్నుమూత

వెస్టిండీస్ క్రికెట్ లో విషాదం చోటు చేసుకుంది. విండీస్ మాజీ ఆల్ రౌండర్ బెర్నార్డ్ జూలియన్ 75 సంవత్సరాల వయసులో మరణించారు. 75 సంవత్సరాల వయసులో వాయువ్య ట్రినిడాడ్‌లోని వల్సేన్‌లో ఆయన మరణించారని కుటుంబ సభ్యుడు ధృవీకరించారు. లెఫ్టర్మ్ సీమర్ అయిన జూలియన్ 18 సంవత్సరాల వయసులో ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. 1973 ఇంగ్లాండ్ పర్యటనలో 23 ఏళ్లకు వెస్టిండీస్ తరపున తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. బెర్నార్డ్ జూలియన్ మరణ వార్త విషాదకరంగా తెలిసిన తర్వాత క్రికెట్ వెస్టిండీస్ అధ్యక్షుడు కిషోర్ షా తన సంతాపాన్ని ప్రకటించారు. 

"బెర్నార్డ్ జూలియన్ కుటుంబానికి, స్నేహితులకు, వారి ప్రియమైన వారికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. ఈ నష్ట సమయంలో క్రికెట్ వెస్టిండీస్ మీతో అండగా నిలుస్తుంది. గొప్ప లక్ష్యాలతో బతికిన ఆయన చాల గొప్పవాడు. వెస్టిండీస్ క్రికెట్ కు అతను ఒక కుటుంబం లాంటి వాడు. అతని శాంతి పొందాలని మేము ఆశిస్తున్నాం". అని కిషోర్ షాలో క్రికెట్ వెస్టిండీస్ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. 1975లో తొలి ప్రపంచ కప్ గెలిచిన జట్టులో జూలియన్ కీలక సభ్యుడని వెస్టిండీస్ దిగ్గజ కెప్టెన్ సర్ క్లైవ్ లాయిడ్ ఆయన్ని ప్రశంసిస్తూ తన సంతాపాన్ని తెలిపారు. 

1975లో జరిగిన తొలి వన్డే ప్రపంచ కప్ లో జూలియన్ వెస్టిండీస్ తరపున స్టార్ పెర్ఫార్మర్‌గా నిలిచాడు. టోర్నమెంట్ గ్రూప్ దశలో శ్రీలంకపై నాలుగు వికెట్లు తీసి అదరగొట్టాడు. సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై మరో నాలుగు వికెట్లు పడగొట్టి జట్టును ఫైనల్ కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఆస్ట్రేలియాపై జరిగిన ఫైనల్లోనూ 26 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. జూలియన్ వెస్టిండీస్ తరఫున ఓవరాల్ గా  24 టెస్ట్ మ్యాచ్‌లు.. 12 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు. 24 టెస్ట్‌ల్లో 866 పరుగులు చేయడంతో పాటు 50 వికెట్లు పడగొట్టాడు. ఇక 12 వన్డేల్లో 18 వికెట్లతో 86 పరుగులు చేశాడు.