పాక్‌ను చితక్కొట్టిన వెస్టిండీస్

పాక్‌ను చితక్కొట్టిన వెస్టిండీస్

ట్రెంట్ బ్రిడ్జ్ : వరల్డ్ కప్ 2019లో భాగంగా నాటింగ్ హామ్ లో జరిగిన లీగ్ మ్యాచ్ లో పాకిస్థాన్ ను చిత్తుచిత్తుగా ఓడించింది వెస్టిండీస్. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 21.4 ఓవర్లలో 105 రన్స్ కే ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 13.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 108 రన్స్ చేసి గెలుపొందింది.

క్రిస్ గేల్ హాఫ్ సెంచరీ

పాకిస్థాన్ విసిరిన 106 పరుగుల టార్గెట్ ను ఉఫ్ అని ఊదిపడేసింది వెస్టిండీస్ టీమ్. టార్గెట్ చేజింగ్ ను బుల్లెట్ స్పీడ్ తో మొదలుపెట్టింది. క్రిస్ గేల్ బౌండరీలు బాది.. పాకిస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో క్రిస్ గేల్ 34 బాల్స్ లోనే 50 రన్స్ కొట్టాడు.

హోప్ 11, బ్రావో 0 పరుగులకే ఔట్ అయినా.. పూరన్(34 నాటౌట్), హెట్ మెయిర్(7 నాటౌట్) మిగతా పని పూర్తిచేశారు. 13.4 ఓవర్లలోనే టార్గెట్ ను పూర్తిచేసింది కరీబియన్ టీమ్.  7 వికెట్ల తేడాతో పాకిస్థాన్ ను వెస్టిండీస్ ఓడించింది.

నలుగురు పాకిస్థాన్ బ్యాట్స్ మెన్ వికెట్లు తీసిన కరీబియన్ బౌలర్ ఒషేన్ థామస్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ దక్కింది.