
ఇండియా, వెస్టిండీస్ మధ్య తొలి టెస్ట్ ప్రారంభమైంది. గురువారం (అక్టోబర్ 2) అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆసియా కప్ తర్వాత టీమిండియా మూడు రోజుల గ్యాప్ లోనే టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ ఇద్దరు పేసర్లు.. ఇద్దరు స్పిన్నర్లు.. ఒక ఆల్ రౌండర్ తో బరిలోకి దిగుతోంది. మరోవైపు ఇండియా బుమ్రా, సిరాజ్ తో పాటు ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతుంది. ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి టీమిండియా ప్లేయింగ్ 11 లో చోటు దక్కడం విశేషం.
భారత్ (ప్లేయింగ్ XI):
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
వెస్టిండీస్ (ప్లేయింగ్ XI):
టాగెనరైన్ చంద్రపాల్, జాన్ కాంప్‌బెల్, అలిక్ అథనాజ్, బ్రాండన్ కింగ్, షాయ్ హోప్ (వికెట్ కీపర్), రోస్టన్ చేజ్(కెప్టెన్), జస్టిన్ గ్రీవ్స్, జోమెల్ వారికన్, ఖారీ పియరీ, జోహన్ లేన్, జేడెన్ సీల్స్