ఆస్ట్రేలియాతో టెస్ట్‌‌‌‌‌‌‌‌ సిరీస్.. ఏడుగురు కొత్త వారికి చోటు

ఆస్ట్రేలియాతో టెస్ట్‌‌‌‌‌‌‌‌ సిరీస్..   ఏడుగురు కొత్త వారికి చోటు

సెయింట్‌‌‌‌‌‌‌‌ జాన్స్‌‌‌‌‌‌‌‌ (అంటిగ్వా): ఆస్ట్రేలియాతో రెండు టెస్ట్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల కోసం వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌ జట్టును  ప్రకటించారు. మొత్తం 15 మందిలో ఏడుగురు అన్‌‌‌‌‌‌‌‌క్యాప్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లకు చోటు కల్పించారు. క్రెయిగ్‌‌‌‌‌‌‌‌ బ్రాత్‌‌‌‌‌‌‌‌వైట్‌‌‌‌‌‌‌‌, అల్జారీ జోసెఫ్‌‌‌‌‌‌‌‌కు కెప్టెన్‌‌‌‌‌‌‌‌, వైస్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. షోల్డర్‌‌‌‌‌‌‌‌ ఇంజ్యురీతో జైడెన్‌‌‌‌‌‌‌‌ సీల్స్‌‌‌‌‌‌‌‌, జేసన్‌‌‌‌‌‌‌‌ హోల్డర్‌‌‌‌‌‌‌‌, కైల్‌‌‌‌‌‌‌‌ మేయర్స్‌‌‌‌‌‌‌‌ ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌కు అందుబాటులో ఉండటం లేదు. డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 30న కరీబియన్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ ఆసీస్‌‌‌‌‌‌‌‌కు చేరుకోనుంది. వచ్చే ఏడాది జనవరి 2 నుంచి 9 వరకు ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌, 10 నుంచి 13 వరకు నాలుగు రోజుల మ్యాచ్‌‌‌‌‌‌‌‌ ఆడనుంది. జనవరి 17 నుంచి 21 వరకు అడిలైడ్‌‌‌‌‌‌‌‌లో తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌, 25 నుంచి 29 వరకు బ్రిస్బేన్‌‌‌‌‌‌‌‌లో  రెండో టెస్ట్‌‌‌‌‌‌‌‌ (డే/నైట్‌‌‌‌‌‌‌‌) జరగనుంది. టెస్ట్‌‌‌‌‌‌‌‌ సిరీస్‌‌‌‌‌‌‌‌ తర్వాత మూడు వన్డేలు, మూడు టీ20లు జరుగుతాయి. 

వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌: బ్రాత్‌‌‌‌‌‌‌‌వైట్‌‌‌‌‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌‌‌‌‌), అల్జారీ జోసెఫ్‌‌‌‌‌‌‌‌, టాగెనరైన్ చందర్‌‌‌‌‌‌‌‌పాల్, కిర్క్ మెకెంజీ, అలిక్ అథనాజ్, కవెమ్ హాడ్జ్, జస్టిన్ గ్రీవ్స్, జాషువా డాసిల్వా, అకీమ్ జోర్డాన్, గుడకేష్ మోతీ, రోచ్, కెవిన్ సింక్లై, టెవిన్ ఇమ్లాచ్, షమర్ జోసెఫ్, జాచరీ మెక్‌‌‌‌‌‌‌‌కాస్కీ.