వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో బుధవారం మొదలైన రెండో టెస్ట్‌లో వెస్టిండీస్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. షై హోప్ (48), జాన్ క్యాంప్‌బెల్ (44) మినహా మిగతావారు నిరాశపర్చడంతో.. తొలి రోజు విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 75 ఓవర్లలో 205 రన్స్‌కు ఆలౌటైంది. టాస్ ఓడిన విండీస్‌కు ఓపెనర్లు క్యాంప్‌బెల్, బ్రెండన్ కింగ్ (33) తొలి వికెట్‌కు 66 రన్స్ జోడించి శుభారంభాన్నిచ్చారు. కానీ కివీస్ బౌలర్లు బ్లెయిర్ టిక్నెర్ (4/32), మైకేల్ రే (3/67) దెబ్బకు మిడిల్, లోయర్ ఆర్డర్ చేతులెత్తేసింది.
కావెమ్ హోడ్జ్ (0), రోస్టన్ ఛేజ్ (29), జస్టిన్ గ్రీవ్స్ (13), టెవిన్ ఇమ్లాచ్ (16), కీమర్ రోచ్ (0), అండర్సన్ ఫిలిప్స్ (5), జైడెన్స్ సీల్స్ (0 నాటౌట్), ఒజయ్ షీల్డ్స్ (0) నిరాశపర్చారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ ఆట ముగిసే టైమ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 9 ఓవర్లలో 24/0 స్కోరు చేసింది. లాథమ్ (7 బ్యాటింగ్), కాన్వే (16 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. కివీస్ ఇంకా 181 రన్స్ వెనకబడి ఉంది. మరోవైపు రెండేళ్ల తర్వాత తొలి టెస్ట్ ఆడుతున్న టిక్నెర్ ఫైన్ లెగ్ వద్ద ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. కదలకుండా పడిపోవడంతో స్ట్రెచర్‌పై గ్రౌండ్ నుంచి బయటకు తీసుకెళ్లారు.

