
అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా చెలరేగి ఆడుతోంది. ప్రత్యర్థి విండీస్ జట్టును సొంతగడ్డపై చిత్తు చేస్తూ భారీ విజయంపై కన్నేసింది. నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో మూడో రోజు ఆటలో భాగంగా భారత స్పిన్నర్ల ధాటికి రెండో ఇన్నింగ్స్ లో అప్పుడే ఐదు వికెట్లను కోల్పోయింది. మూడో రోజు ఇండియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంతో బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ తొలి సెషన్ ముగిసేసరికి రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసి ఓటమి అంచుల్లో నిలిచింది. అలిక్ అథనాజ్ (27) జస్టిన్ గ్రీవ్స్ (10) ఉన్నారు. ప్రస్తుతం వెస్టిండీస్ ఇంకా 220 పరుగులు వెనకబడి ఉంది.
మూడో రోజు రెండో సెషన్ లో టీమిండియా విజయం ఖరారయ్యేలా కనిపిస్తోంది. మూడో రోజు ఉదయాన్నే రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ వరుస విరామాల్లో వికెట్లను కోల్పోతూ వచ్చింది. ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఇన్నింగ్స్ 8 ఓవర్ రెండో బంతికి విండీస్ ఓపెనర్ చందర్ పాల్ ను ఔట్ చేసి ఇండియాకు తొలి వికెట్ అందించాడు. ఆ తర్వాత జడేజా తన స్పిన్ మాయాజాలంతో జాన్ కాంప్‌బెల్ (14), బ్రాండన్ కింగ్ (5) ను ఔట్ చేసి వెస్టిండీస్ ను కష్టాల్లో నెట్టాడు. ఒక మ్యాజికల్ డెలివరీతో కుల్దీప్ యాదవ్ వెస్టిండీస్ కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (5) ను పెవిలియన్ కు పంపాడు.
21 ఓవర్లో జడేజా బౌలింగ్ లో జైశ్వాల్ పట్టిన ఒక అద్భుతమైన క్యాచ్ కు హోప్ (1) ఔట్ కావడంతో విండీస్ జట్టు 46 పరుగులకే 5 వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత అథనాజ్ (27) జస్టిన్ గ్రీవ్స్ (10) లంచ్ వరకు మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఇండియా బౌలర్లలో జడేజా మూడు వికెట్లు పడగొట్టాడు. సిరాజ్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసుకున్నారు. రెండో రోజు (శుక్రవారం) ఆట ముగిసే సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి మూడో రోజు ఉదయాన్నే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
ధ్రువ్ జురెల్ (210 బాల్స్‌లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 125), రవీంద్ర జడేజా (176 బాల్స్‌లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 104 బ్యాటింగ్), కేఎల్ రాహుల్ (197 బాల్స్‌లో 12 ఫోర్లతో 100) సెంచరీలతో చెలరేగడంతో వెస్టిండీస్‌తో తొలి టెస్టును ఇండియా పూర్తిగా తన కంట్రోల్‌లోకి తీసుకుంది. అంతకుముందు గురువారం టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 44.1 ఓవర్లలో 162 రన్స్‌కే కుప్పకూలింది. జస్టిన్ గ్రీవ్స్ (32), షై హోప్ (26), కెప్టెన్ రోస్టన్ చేజ్ (24) మాత్రమే కాసేపు ప్రతిఘటించారు.
ఇండియా బౌలర్లలో సిరాజ్ (4/40), బుమ్రా (3/42), కుల్దీప్ (2/25) విండీస్ నడ్డి విరిచారు. అనంతరం బ్యాటింగ్‌లోనూ దుమ్మురేపిన ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 286 రన్స్ ఆధిక్యం సంపాదించింది. టీమిండియా బౌలర్లలో సిరాజ్ ఐదు వికెట్లు పడగొట్టాడు. బుమ్రా మూడు.. కుల్దీప్ యాదవ్ రెండు.. సుందర్ ఒక వికెట్ తీసుకున్నారు.
#TeamIndia's fielding brilliance continues 👏
— BCCI (@BCCI) October 4, 2025
This time it's Yashasvi Jaiswal 👌
West Indies 5️⃣ down now!
Updates ▶ https://t.co/MNXdZceTab#INDvWI | @IDFCFIRSTBank | @ybj_19 pic.twitter.com/5gKY0dXiVt