జులై4న డబ్ల్యూఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ ఎలక్షన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

 జులై4న డబ్ల్యూఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ ఎలక్షన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ:  రెజ్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫెడరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా (డబ్ల్యూఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ) ఎలక్షన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జులై 4న జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణకు జమ్మూ కాశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైకోర్టు మాజీ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జస్టిస్  మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిట్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిటర్నింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నియమించినట్టు  ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఐఓఏ) సోమవారం ప్రకటించింది.

యాన్యువల్ జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాడీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేదా ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీఎంలో ఎన్నికలు నిర్వహిస్తారు.  డబ్ల్యూఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐకి 25 అనుబంధ సంఘాలు ఉన్నాయి. ఓటు వేసేందుకు ప్రతి రాష్ట్ర సంఘం ఇద్దరు ప్రతినిధులను నామినేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయవచ్చు.  ఈలెక్కన డబ్ల్యూఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ ఎన్నికల కోసం ఎలక్టోరల్ కాలేజీలో 50 ఓట్లు ఉంటాయి.  కాగా,  లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూషణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్యామిలీ మెంబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గానీ, ఆయనకు సంబంధించిన వాళ్లను గానీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతించబోమని స్పోర్ట్స్​ మినిస్టర్​ అనురాగ్​ ఠాకూర్​ రెజ్లర్లకు హామీ ఇచ్చారు.