సడెన్గా హార్ట్ ఎటాక్... ఎందుకొస్తుందంటే ?

సడెన్గా హార్ట్ ఎటాక్... ఎందుకొస్తుందంటే ?

ఒకప్పుడు గుండెపోటు అంటే వయసు పైబడిన వారికే అనుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అందుకు ఇటీవలి కాలంలో చోటు చేసుకుంటున్న మరణాలే కారణం. అందుకు ముఖ్య కారణాలేంటీ.. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ జీవితాన్ని గడపాల్సిన వయసులో ఈ మరణాలేంటీ.. అనేవి అందర్నీ వేధిస్తున్న ప్రశ్నలు. టెక్నాలజీ ఎంత పెరిగినా.. సరైన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోకపోకపోతే వ్యాధుల బారిన పడాల్సిందేనని దీన్ని బట్టి తెలుస్తోంది. మనిషికి డబ్బు అవసరమే. కానీ ఆ హడావిడిలో పడి చాలా మంది ఆరోగ్యాన్ని పక్కన పెడుతున్నారు. చిన్న చిన్న వాటికే ఆవేదన చెందడం, తినడానికి కూడా తీరిక లేకపోవడంతో పస్తులు ఉండి సమస్యలు తెచ్చుకోవడం, టెన్షన్, బాధ నేపథ్యంలో చిరాకు పడడం, నిద్రలేమి వంటి ఎన్నో కారణాలు నేటి యువతను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

ముఖ్యంగా 30 నుండి 50 ఏళ్ల వయసున్న ప్రతీ నలుగురు భారతీయులు గుండె నొప్పితో బాధపడడం అందర్నీ ఆందోళన కలిగించే విషయం. ఇటీవలి కాలంలో చాలా మంది ఎందుకు గుండెపోటు బారిన పడుతున్నారు ? ఎందుకు అది మృత్యు ఒడికి చేరుస్తోంది ? అనే విషయాలను గమనిస్తే..

  • చాలా మంది చిన్న వయసులోనే గుండె సంబంధిత వ్యాధులతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. రావల్సిన దానికన్నా 8 - 10 సంవత్సరాల ముందే ఈ వ్యాధులు అటాక్ కావడం అందర్నీ ఆందోళన కలిగిస్తోంది. అందులోనూ దక్షిణాది ప్రజలకు ఎక్కువగా హై బీపీ, ఎక్కువ కొలెస్ట్రాల్, టైప్ 2 డయాబెటిక్స్ ఉండడం, ఉండాల్సిన దానికన్నా తక్కువ బరువును కలిగి ఉండడం వలన గుండెకు సంబంధించిన డిసీజెస్ అటాక్ అవుతున్నాయని సమాచారం.
  • జీవనశైలిలో మార్పులూ పలు వ్యాధులకు కారణాలుగా తెలుస్తోంది . ఎక్కువ ఉప్పు, ఎక్కువ తీపితో కూడిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ నిల్వకు దారితీస్తుంది. ఫలితంగా హైపర్ టెన్షన్..అంటే రక్తపోటును ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది గుండెపై అనవసరమైన ఒత్తిడిని కలిగిస్తుంది.
  • వీటన్నింటికి తోడు నిద్ర లేమి, వ్యాయామం చేయకపోవడం, బరువు పెరగడం, ఒత్తిడి పెరగడం, డయాబెటిక్స్ లాంటి వన్నీ కూడా గుండెకు హాని కలిగించేవేనని పలువురు హెచ్చరిస్తున్నారు. దీని ఫలితంగా కూడా గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. 
  • డయాబెటిక్స్ అనేది ఇండియాకు క్యాపిటిల్ గా మారింది. ప్రస్తుతం యువతలో దీని ప్రాబల్యం 10% కంటే ఎక్కువగా పెరిగింది. ఇక్కడ చెప్పుకోదగిన మరో విషయమేమిటంటే గుండె వ్యాధుల కన్నా డయాబెటిక్స్ అనేది మూడింతలు అత్యంత హానికరమైనది. ఇది రక్తలో చక్కెర స్థాయిలను పెంచడమే గాక, కొన్నిసార్లు రక్తం గడ్డం కట్టే దారుణమైన స్థితికి తెరలేపుతుంది. అంతే కాకుండా ఈ వ్యాధి వల్ల గుండె ధమనుల్లో వాపులు రావడం జరిగి పరిస్థితిని ఇంకా దిగజారుస్తుంది. ఇది కూడా ఒక రకంగా గుండె పోటుకు దారితీస్తుంది.

  • పొగాకు.. ఇది సాధారణంగా సిగరెట్లు, బీడీలలో మిళితమై ఉంటుంది. యువతలో అత్యధికంగా గుండె నొప్పి రావడానికి  ఇదే కారణమవుతోంది. సిగరెట్ల నుంచి వచ్చే పొగను పీల్చడం వల్ల అందులో అధిక మొత్తంలో ఉండే కార్భన్ డై యాక్సైడ్ స్థాయిలు రక్తంలో ప్రవహించే ఆక్సిజన్ ను నిలిపివేస్తాయి. దీని వల్ల శరీరంలోని వివిధ అవయవాలకు సరైన ఆక్సిజన్ అందక, గుండె చేసే ప్రసరణ ప్రక్రియ నిలిచిపోతుంది. ఫలితంగా గుండె నుంచి ఇతర అవయవాలకు రక్తం సక్రమ మార్గంలో ప్రసరణ జరగదు . ఇంకో ముఖ్య విషయమేమిటంటే పొగాకు వల్ల కూడా శరీరంలో కొవ్వు శాతం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. 
  • ఇక మద్యపానం ఎక్కువగా సేవించడం వల్ల ధమనులు బిగుతుగా మారుతాయి. ధమనులు ఎంత తక్కువ సాగే గుణాన్ని కలిగి ఉంటే అంత ఎక్కువ ఎక్కువ స్థాయిలో రక్త ప్రసరణ జరుగుతుంది. ఇది గుండె నొప్పి రావడాన్ని నిర్మూలిస్తుంది. ప్రస్తుత జనరేషన్ లో యువత ఎక్కువగా ఆల్కహాల్ సేవించడం, పొగ తాగడం వల్ల ఈ కేసులు మరింత ఎక్కువవుతున్నట్టు తెలుస్తోంది.

కాబట్టి గుండె పదిలంగా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తప్పనిసరి. సరైన ఆహారంతో పాటు వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటేనే ముందు తరాలకు ఆసరాగా నిలిచే అవకాశముంటుంది. ప్రస్తుత కాలంలో ఎప్పుడు ఏ వ్యాధి ముంచుకొస్తుందో.. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఆందోళ చెందే పరిస్థితి. ఈ నేపథ్యంలో శరీరానికి తగిన శ్రమతో పాటు, సరైన జీవన శైలి కూడా ముఖ్యమే అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

మరిన్ని వార్తల కోసం..

ఉక్రెయిన్ కు అత్యాధునిక రాకెట్లను ఇస్తం

కేకే మరణవార్త విని గుండె ముక్కలైంది