బాలయ్య చెప్పింది తప్పు.. జగన్ ఎవర్నీ అవమానించ లేదు : ఆర్.నారాయణమూర్తి

బాలయ్య చెప్పింది తప్పు.. జగన్ ఎవర్నీ అవమానించ లేదు : ఆర్.నారాయణమూర్తి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వివాదాస్పద కామెంట్స్ పై ఆర్.నారాయణ మూర్తి  స్పందించారు. సినీ ప్రతినిధులను జగన్ అవమానించారని బాలయ్య చెప్పడం తప్పు అని అన్నారు. జగన్ ఎవర్నీ అవమానించలేదని తెలిపారు. పేర్ని నాని ఆధ్వర్యంలో జగన్ ను కలిశామని.. తమను అంతా మంచిగానే రిసీవ్ చేసుకున్నారని స్పష్టం చేశారు. 

 శనివారం (సెప్టెంబర్ 27) ప్రెస్ తో మాట్లాడిన ఆర్ నారాయణ మూర్తి.. తన పేరును ప్రెస్ నోట్ లో చిరంజీవి మెన్షన్ చేసినందున ఈ వివాదంపై మాట్లాడుతున్నానని అన్నారు.  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నాయకులు మాట్లాడిన  కామెంట్స్ పై చిరంజీవి మాట్లాడింది నిజం అని అన్నారు. 

జగన్ ను కలిసే ముందు చిరంజీవి నాకు ఫోన్ చేసారు.. చిన్న సినిమాలు, నిర్మాతలు బతకాలి అన్నారు.. ఈ విషయంలో చిరంజీవి తీసుకున్న ఇన్షియేటివ్ గ్రేట్. ఈ విషయంలో బాలయ్యకు తెలిసింది బాలయ్య చెప్పారు.. కానీ కరెక్ట్ కాదు.. మమ్మల్ని వైఎస్ జగన్ ప్రభుత్వం అవమానించింది అనడం తప్పు.. అంటూ క్లారిఫై చేశారు నారాయణమూర్తి. 

చిన్న సినిమా బతకాలంటే గత ప్రభుత్వాలు చెప్పినవి ఇప్పటి ప్రభుత్వం నెరవేర్చాలని కోరుతున్నానని నారాయణమూర్తి అన్నారు. టికెట్ ధరల పెంపు తప్పు.. సామాన్యుడికి ఎంటర్టైన్మెంట్ సినిమా.. వాళ్లకు వినోదం దూరం చేయవద్దు అని ఆయన అన్నారు. 
 
టికెట్ల పెంపు విషయంలో మొదట్లో కెసీఆర్ సినిమా ధరలు పెంచను అన్నారు.. తరువాత పెంచారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి కూడా పెంచారు.. ఇది కరెక్ట్ కాదు. అప్పట్లో లవకుశ సినిమాకి టికెట్ ధరలు పెంచలేదు.. బండ్లలో డబ్బులు వచ్చాయి. ఇప్పుడు కూడా టికెట్ ధర తక్కువగా ఉంటేనే ప్రేక్షకులు ఎక్కువగా చూస్తారు అని అభిప్రాయం వ్యక్తం చేశారు.

టికెట్ ధరలు పెంచీ సామాన్యుడి మీద భారం మోపడం కరెక్ట్ కాదన్నారు నారాయణమూర్తి. టికెట్ ధరలు పెంచను, మిడ్ నైట్ షో లకు అనుతించము అని అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి అన్నారు.  .. మళ్లీ పెంచారు.. ఏపీలో కూడా ఇదే జరుగుతుంది. ఇది దారుణం. రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు దయచేసి  టికెట్ ధరలు పెంచవద్దు.. ఇది నా విన్నపం అంటూ వేడుకున్నారు.