Benefits of Milk: హెల్దీగా ఉండాలంటే.. పాలు తాగితే చాలు.. పాలు తాగడం వల్ల బరువు పెరుగుతారా..?

Benefits of Milk: హెల్దీగా ఉండాలంటే.. పాలు తాగితే చాలు.. పాలు తాగడం వల్ల బరువు పెరుగుతారా..?

పాలు పోషకాహారం. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇది బలవర్థకమైన ఆహారం. అందుకే డాక్టర్లు కూడా రోజూ పాలు తాగాలని చెప్తుంటారు. అందుకు కారణాలేంటి? పాలలోని ప్రత్యేకత ఏంటి? అన్నింటికీ మించి పాల కోసం ఒక డే సెలబ్రేట్ చేసుకోవడం ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.

పాలు మన నిత్యజీవితంలో ఒక భాగం. నేరుగా కాకపోయినా టీ, కాఫీ వంటి రూపాల్లో తీసుకుంటుంటాం. అలాగే పాల ఉత్పత్తులు కూడా మన డైలీ లైఫ్​లో విరివిగా వాడుతుంటాం. ఎందుకంటే పాలు పోషకాహారం కాబట్టి. పాలలో మన శరీరానికి కావాల్సిన ప్రొటీన్స్, కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్​, రైబో ఫ్లావిన్, నియాసిన్ ఉంటాయి. వాటితోపాటు విటమిన్​ ఎ, డి, బి12, మైక్రో మినరల్స్ కూడా ఉంటాయి. శరీరంలోని కొన్ని రకాల హార్మోన్ల ఉత్పత్తికి అవసరమయ్యే కొవ్వు పదార్థాలు పాల ద్వారానే లభిస్తాయి. పాలు మెదడును చురుగ్గా పనిచేసేలా చేస్తాయి. పాలు తాగితే కంటిచూపు మెరుగవుతుంది. 

ఎక్సర్​సైజ్​, వర్కవుట్స్ వంటివి చేసిన తర్వాత పాలు తాగితే ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. నిద్రలేమితో బాధపడేవాళ్లు పడుకునే ముందు ఒక గ్లాసు పాలలో కాస్త తేనె కలుపుకుని తాగడం మంచిది. పాలలో పసుపు, మిరియాలు, శొంఠి వంటివి కలుపుకుని తాగడం వల్ల వైరస్, బ్యాక్టీరియా వంటివి నశిస్తాయి. దాహం ఎక్కువగా ఉన్నప్పుడు నీటి కంటే పాలు తాగితే దప్పిక తీరుతుంది. పాలు1.5 రెట్లు ఎక్కువగా దాహం తీర్చగలవు. పాలలో 85 – 95 శాతం నీరే ఉంటుంది. పాలు నేరుగా తాగడం ఇష్టం లేని వాళ్లు అందులో కార్న్​ఫ్లేక్స్, నట్స్​, ఓట్స్ వేసుకుని తీసుకోవచ్చు. కొందరికి పాలు జీర్ణం కావు. అలాంటివాళ్లు సోయా పాలు, బాదం పాలు, కొబ్బరి పాలు వంటివి తీసుకోవచ్చు. 

బరువు తగ్గుతారు
పాలు తాగడం వల్ల బరువు పెరుగుతారనేది అపోహ. నిజానికి పాలలోని కొవ్వులు అధిక బరువును తగ్గించడంలో సాయపడతాయి. అది కూడా కొవ్వు ఎక్కువగా ఉండే పాలు తీసుకోవాలి. కొవ్వు ఎక్కువగా ఉన్నప్పటికీ అందులోని బయో యాక్టివ్ పదార్థం బాడీలో కొవ్వును కరిగేలా చేస్తుంది. పాలు రోజూ తాగడం వల్ల బోలు ఎముకల వ్యాధి, ఎముకల్లో పగుళ్లు వచ్చే ప్రమాదం తగ్గుతుందని స్టడీలు చెప్తున్నాయి. పాలలోని కాల్షియం, నేచురల్ ఫ్యాట్స్ క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. కాల్షియం, విటమిన్​ డి క్యాన్సర్​ నుంచి రక్షిస్తాయి. పెద్దపేగు లేదా ప్రొస్టేట్, రొమ్ము క్యాన్సర్​ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. 

సెలబ్రేట్ ది పవర్ ఆఫ్ ​డెయిరీ
ప్రపంచంలోని అతిపెద్ద పాల ఉత్పత్తిదారుల్లో భారతదేశం ఒకటి. ఈ ఏడాది లెక్కల ప్రకారం 200 మిలియన్ మెట్రిక్ టన్నులకు పైగా పాలను ఉత్పత్తి చేస్తోంది. ప్రతి ఏటా జూన్ 1న ప్రపంచ పాల దినోత్సవాన్ని జరుపుకుంటారు. పాడి రంగాన్ని డెవలప్ చేయడానికి ఐరాస సంబంధిత ఫుడ్​ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. ఈ డే సందర్భంగా నిత్య జీవితంలో పాలు, పాల ప్రొడక్ట్స్ ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేస్తారు. ఈ ఏడాది థీమ్ ఏంటంటే.. లెట్స్ సెలబ్రేట్ ది పవర్ ఆఫ్​ డెయిరీ. 

ఫన్నీ ఫ్యాక్ట్స్
* ప్రాచీన కాలంలో గ్రీకులు, రోమన్లు, ఈజిప్షియన్లు, భారతీయులు పాలను దేవుళ్ల ఆహారంగా భావించేవారు. 
* పాలు తెల్లగా ఉండడానికి గల కారణం అందులో ఉండే ఫ్యాట్, ప్రొటీన్తో పాటు అధిక శాతంలో ఉండే నీళ్లు. ఫ్యాట్, ప్రొటీన్ అణువులు లైట్​ రిఫ్లెక్షన్ వల్ల వైట్ కలర్​లో కనిపిస్తాయి. 
* పాలతో బయో ప్లాస్టిక్ తయారుచేయొచ్చు. దీనికి వాసన ఉండదు. భూమిలో కలిసిపోతుంది. కానీ నీటిలో కరగదు. నిప్పు అంటుకోదు. అందుకు కారణం పాలలో ఉండే కెసిన్, ఫార్మాల్డిహైడ్ పదార్థాలు. 
* అమెరికాలోని పెన్సిల్వేనియాలో పాల ట్రేలను పాల పదార్థాల కోసమే వాడాలి. ఇతర అవసరాల కోసం వాడితే వేల రూపాయలు ఫైన్ కట్టాల్సి వస్తుంది. లేదంటే 90 రోజులు జైలు శిక్ష పడుతుంది. 
* రష్యాలో పూర్వం పాలు పులవకుండా ఉండేందుకు వాటిలో కప్పలను వేసేవారు. బకెట్​ పాలలో ఒక్క కప్పను వేస్తే చాలు. 
* పాల ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత అందులో కొంచెం ఉప్పు వేస్తే పాల పాడవ్వకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటాయట!