
న్యూఢిల్లీ, వెలుగు: ‘‘ఛాయ్ వాలా అయిన ప్రధాని మోదీ.. దేశానికి ఏమి చేయడం లేదని కేటీఆర్ విమర్శిస్తున్నరు. మరి ఆయన తండ్రి దారూవాలా కేసీఆర్.. రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలి?” అని బీజేపీ నేత, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ ప్రశ్నించారు. కేటీఆర్ ఓ రాజకీయ బచ్చా అని విమర్శించారు. ప్రధానిని ఛాయ్‌వాలా అంటూ కేటీఆర్ చేస్తున్న కామెంట్స్ చూస్తుంటే.. గతంలో అమెరికాలో ఆయన బాత్రూమ్స్ కడిగారంటూ జరిగిన ప్రచారం నిజమే అనిపిస్తున్నదన్నారు.
శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లు, ట్రిపుల్ తలాక్, రామమందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు, ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేయడం వంటి ఎన్నో నిర్ణయాలను ప్రధాని తీసుకున్నారని చెప్పారు.