హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనలో సమాధానం దొరకని ఐదు ప్రశ్నలు

హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనలో సమాధానం దొరకని ఐదు ప్రశ్నలు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన హత్రాస్ గ్యాంగ్ రేప్‌‌పై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బాధితురాలైన 19 ఏళ్ల దళిత యువతి కుటుంబీకులను కాంగ్రెస్ సీనియర్లు రాహుల్ గాంధీ, ప్రియాంక శనివారం కలిశారు. అనంతరం ఈ ఘటనలో జవాబులు దొరకని ఐదు ప్రశ్నలు ఇవేనంటూ ప్రియాంక ఓ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ హాట్ టాపిక్‌‌గా మారింది.

ప్రియాంక ట్వీట్ చేసిన ఆ ఐదు ప్రశ్నలివే:
1. హత్రాస్ ఘటనపై న్యాయపరంగా సమగ్ర విచారణ జరపాలి.
2. హత్రాస్ డీఎంను సస్సెండ్ చేయడంతోపాటు ఆయనకు పెద్ద పోస్ట్ ఇవ్వకుండా చూడాలి.
3. హత్రాస్ బాధితురాలి శవాన్ని ఆమె తల్లిదండ్రుల అనుమతి తీసుకోకుండా ఎందుకు అంత్యక్రియలు చేశారు?
4. బాధితురాలి కుటుంబీకులను పదే పదే ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారు? అలాగే వారిని ఎందుకు బెదిరిస్తున్నారు?
5. బాధితురాలికి అంత్యక్రియలు జరిగిన చోటు నుంచి ఆమె పేరెంట్స్ పువ్వులను తీసుకొచ్చారు. కానీ ఆ మ‌ృత దేహం ఆ అమ్మాయిదేనని ఎలా నమ్మాలి?
ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడం హత్రాస్ బాధితురాలి కుటుంబీకుల హక్కు అని, యూపీ సర్కార్ వీటికి సమాధానం ఇవ్వాలని ప్రియాంక డిమాండ్ చేశారు.