ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

పానగల్, వెలుగు:  కొల్లాపూర్‌‌‌‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్య ఆధిపత్య పోరును తప్ప.. అభివృద్ధిని పట్టించుకోవడం లేదని  బీజేపీ నాగర్ కర్నూల్‌‌ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు విమర్శించారు.  ఆయన చేపట్టిన పాదయాత్ర 100 కిలోమీటర్లకు చేరింది. శనివారం పానగల్ మండలం  బుసిరెడ్డిపల్లి గ్రామంలోకి పాదయాత్ర గ్రామంలోకి అడుగుపెట్టగానే మహిళలు  మంగళ హారతులతో పెద్ద ఎత్తున స్వాగతం  పలికారు.  శివాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం బీజేపీ జెండాను ఆవిష్కరించారు. అక్కడి నుంచి రాయినిపల్లి మీదుగా మాందాపూర్ వరకు నడిచారు. ఈ సందర్భంగా సుధాకర్ రావు  మాట్లాడుతూ రేషన్ బియ్యం, మరుగుదొడ్లు నిర్మాణం, దీపం సిలిండర్లకు  కేంద్రమే  నిధులు ఇస్తోందని గుర్తుచేశారు. సోమశిల–సిద్దేశ్వరం వంతెనకు ఇప్పటికే నిధులు మంజూరు చేసిందని చెప్పారు.  నియోజకవర్గానికి రైలు మార్గం రావాలంటే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలన్నారు.  బుసిరెడ్డిపల్లి గ్రామ  ప్రజల కోరిక మేరకు బోల్లిగట్టుకు రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా జనరల్ సెక్రటరీ నారాయణ, రామన్ గౌడ్, మండల అధ్యక్షుడు అన్వేశ్, మహిళ మోర్చా అధికార ప్రతినిధి రోజా రమణి, జిల్లా ప్రధాన కార్యదర్శి రమేశ్, లక్ష్మణ్, నాగరాజు,  కురుమయ్య పాల్గొన్నారు.

అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణలో గొడవ

  • రాజకీయంగా దెబ్బ తీస్తున్నారన్న ఎమ్మెల్యే గువ్వల
  • అభ్యంతరం చెప్పిన కాంగ్రెస్ నేతలు

అమ్రాబాద్, వెలుగు: అంబేద్కర్‌‌‌‌ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కాంగ్రెస్‌‌, టీఆర్‌‌‌‌ఎస్‌‌ నేతల మధ్య గొడవ జరిగింది. శనివారం మండలంలోని వటవర్లపల్లిలో అంబేద్కర్ కమిటీ అధ్యక్షుడు అనిల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు. డీసీసీ ప్రెసిడెంట్ వంశీకృష్ణ, బీజేపీ నేత సతీశ్ మాదిగ, బీఎస్పీ ఇన్‌‌చార్జి కొయ్యల శ్రీనివాసులు, సమతా దళ్ సౌత్ ఇండియా ప్రెసిడెంట్ రెంజర్ల రాజేశ్‌‌, భారత నాస్తిక సమాజం అధ్యక్షుడు బైరి నరేశ్, సర్పంచ్ చత్రునాయక్, ఎంపీటీసీ మల్లిఖార్జున్ రావ్,   కుల సంఘాల నేతలు కూడా అంబేద్కర్‌‌‌‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఏర్పాటు సమావేశంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ... రాజకీయంగా తనను చాలామంది దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని, అన్నింటిని ఎదుర్కొని నిలిచానన్నారు. దీంతో అచ్చంపేట మాజీ ఎంపీపీ రామనాథం, కాంగ్రెస్‌‌ నేతలు అభ్యంతరం చెప్పారు. అంబేద్కర్‌‌‌‌ విగ్రహావిష్కరణలో రాజకీయాలు ఏంటని ప్రశ్నించారు.  ఆగ్రహించిన ఎమ్మెల్యే అనుచరులు వాగ్వానికి దిగారు.  ఇరువర్గాలు తోసుకునే వరకు వెళ్లింది. పరిస్థితి ఉద్రక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి  అదుపులోకి తెచ్చారు.

యాసంగి సాగుకు సంగంబండ నీళ్లిస్తాం

మక్తల్, వెలుగు: సంగంబండ కింద యాసంగి సాగుకు నీటిని విడుదల చేస్తామని కలెక్టర్​ కోయ శ్రీహర్ష హామీ ఇచ్చారు. శనివారం మండలంలోని ప్రాజెక్టును ఇరిగేషన్ అధికారులతో కలిసి సందర్శించారు.  ఈ సందర్భంగా రిజర్వాయర్‌‌‌‌లో నీటి నిల్వ గురించి ఆరా తీయగా.. ప్రస్తుతం 2.2 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయని,  16,500 ఎకరాలకు ఇవ్వొచ్చని అధికారులు వివరించారు. అనంతరం కలెక్టర్  మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు రానివ్వొద్దని సూచించారు. ఎడమ కాలువ భూసేకరణను త్వరగా కంప్లీట్ చేస్తే  నిర్మాణానికి  చర్యలు తీసుకుంటామని చెప్పారు.  ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్‌‌ఈ శివ ధర్మ తేజ,  అసిస్టెంట్ ఈఈ  హమీద్ అబ్దుల్ షకీల్ , ఎమ్మార్వో తిరుపతయ్య పాల్గొన్నారు.

బడి పనుల్లో వేగం పెంచండి

నారాయణపేట, మాగనూర్, వెలుగు:  మన ఊరు– మన బడి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శనివారం మాగనూర్ మండల కేంద్రంలో ప్రైమరీ స్కూల్‌‌,  కొత్తపల్లి,  కృష్ణ మండలంలోని కున్సి ,   హిందూపూర్‌‌, నేరెడ్గాం జడ్పీ స్కూళ్లను పరిశీలించారు.  హిందూపూర్‌‌‌‌లో బడి పనులు స్టార్ట్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.   టీచర్లు డ్యూటీని నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్‌‌లో  పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.  జిల్లాలో మొదటి విడతలో  168 స్కూళ్లు  ఎంపిక చేశామని, ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. పెండింగ్‌‌లో ఉన్న  ప్రహరీ, పెయింటింగ్, విద్యుత్ పరికరాల అమర్చడం లాంటి పనులు త్వరగా కంప్లీట్ చేయాలని ఆదేశించారు .

రక్తహీనత అరికట్టేందుకు న్యూట్రిషన్ కిట్లు

గద్వాల, వెలుగు: గర్భిణులు, బాలింతల్లో రక్తహీనత అరికట్టేందుకు ప్రభుత్వం న్యూట్రిషన్ కిట్లు అందిస్తోందని కలెక్టర్ వల్లూరు క్రాంతి చెప్పారు. శనివారం కలెక్టరేట్ మీటింగ్ హాల్‌‌లో పీహెచ్‌‌సీ డాక్టర్లతో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పీహెచ్‌‌సీ పరిధిలో ఎంతమంది గర్భిణులు, బాలింతలు ఉన్నారో..? వివరాలు సేకరించి అందుకు తగ్గట్లుగా స్టోరేజీ రూమ్‌‌  ఏర్పాటు చేసుకొని న్యూట్రిషన్ కిట్లను భద్రపరచాలన్నారు. జిల్లాలో 2032 మంది గర్భిణులు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయని, డెలివరీ ముందు, తర్వాత ఈ కిట్లను అందించాలన్నారు. ప్రతి కాన్పు ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగే విధంగా డాక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే జనవరి 18 నుంచి ప్రారంభం కానున్న కంటి వెలుగును సక్సెస్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్‌‌చార్జి డీఎంహెచ్‌‌వో శశికళ, హాస్పిటల్ సూపరింటెండెంట్ నవీన్ క్రాంతి , డాక్టర్లు సిద్ధప్ప, ఇర్షాద్ పాల్గొన్నారు.

19న మంత్రుల పర్యటన

ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు

వనపర్తి, వెలుగు: ఈ నెల 19 న జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌‌ రెడ్డితో పాటు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీసీ వెల్ఫేర్, పౌరసరాఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పర్యటించనున్నారు. కొత్త మెడికల్ కాలేజీ సమీపంలోని ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్ భవనానికి  శంకుస్థాపన చేయడంతో పాటు  ఐటీఐ కాలేజీ  భవనం, పెద్దగూడెం శివారులో బీసీ రెసిడెన్షియల్ వ్యవసాయ మహిళా డిగ్రీ కాలేజీని ప్రారంభించనున్నారు. అనంతరం మంత్రి  నిరంజన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారు.  ఈ మేరకు శనివారం అడిషనల్‌‌ కలెక్టర్‌‌‌‌ వేణుగోపాల్ వ్యవసాయ మహిళా డిగ్రీ కాలేజీ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు.  అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన  వెంట ఏఎస్పీ షా కీర్ హుస్సేన్, ఆర్డీవో పద్మావతి, బీసీ సంక్షేమ శాఖ అధికారి అనిల్, డీసీవో మాధవాచారి, వ్యవసాయ కాలేజీ ప్రిన్సిపాల్ సుధాకర్,  ఎమ్మార్వో రాజేందర్ గౌడ్ పాల్గొన్నారు.