మంకీపాక్స్ అంటే ఏమిటీ..ఈ వ్యాధి ఎలా సోకుతోంది..?

మంకీపాక్స్ అంటే ఏమిటీ..ఈ వ్యాధి ఎలా సోకుతోంది..?

కరోనా కల్లోలంతో ప్రజలను కొత్త వైరస్ ల భయం వెంటాడుతోంది. తాజాగా మంకీ పాక్స్ వైరస్ పలు దేశాల్లో బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కెనడా, ఐరోపా, స్పెయిన్, పోర్చుగల్, జర్మనీ, బెల్జియం  దేశాలలో మంకీ పాక్స్ కేసులు నమోదయ్యాయి. మంకీపాక్స్ కేసులు ఎక్కువగ ఆఫ్రికా దేశాలకే పరిమితమవుతుంది. అరుదుగా మాత్రమే మిగితా దేశాలకు వ్యాపిస్తోంది. 

మంకీపాక్స్ అంటే ఏమిటీ 

మంకీపాక్స్ అనేది తేలికపాటి వైరస్. మశూచి లాంటిదే మంకీపాక్స్ కూడా. ఇది తొలిసారి 1958లో పరిశోధనల్లో భాగంగా కోతుల నుంచి ఈ వ్యాధిని కొనుగొన్నారు. అందుకే దీనికి మంకీపాక్స్ అని పేరు పెట్టారు. 1970లో మొదటిసారి మనుషుల్లో ఈ వ్యాధి కనిపించింది. 2003లో అమెరికాలో ఈ వ్యాధి రోగులను గుర్తించారు. 2018లో ఈ వ్యాధి ఇజ్రాయెల్, బ్రిటన్ లకు చేరుకుంది.

మంకీపాక్స్ వ్యాధి లక్షణాలు

మంకీపాక్స్ వ్యాధి సోకితే జ్వరం, తలనొప్పి, వాపు, నడుంనొప్పి, కండరాల నొప్పి, అలసట వంటి లక్షణాలు కన్పిస్తాయి. ముఖం, చేతులు, కాళ్లపై దద్దుర్లు, బొబ్బలు ఏర్పడతాయి. ఒక్కోసారి శరీరమంతా ఇవి వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు తెలిపారు. ఈ లక్షణాలు 2-4  వారాలపాటు ఉంటాయి. ఈ వ్యాధి సోకిన వారిలో చాలామంది వారాల్లోనే కోలుకుంటారు. అయితే 10 మందిలో ఒకరికి ఇది ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్ వో తెలిపింది.

 

మంకీపాక్స్ ఎలా సోకుతుంది

మంకీపాక్స్ సోకిన జంతువు కరవడం, రక్తం, శరీర ద్రవాలు, జంతువుల యొక్క జుట్టును తాకడం ద్వారా ఈ వ్యాధి మనుషులకు సోకవచ్చు. ఇది ఎలుకలు, ఉడుతలు వంటి వాటి ద్వారాకూడా మనుషులకు వ్యాపిస్తుందని వైద్యులు తెలిపారు. దీనికితోడు వ్యాధి సోకిన జంతువు నుండి మాంసాన్ని సరిగ్గా ఉడికించకుండా తినడం ద్వారా కూడా ఈ వ్యాధి మనుషులకు సోకే అవకాశం ఉంది. దద్దుర్లు ఉన్నవారు ఉపయోగించే దుస్తులు,పరుపు, తువ్వాలను తాకడం ద్వారా మరొకరికి సోకుతుంది.  మంకీపాక్స్ వ్యాధి సోకిన వారు చనిపోయే అవకాశాలు తక్కువే. చిన్నిపిల్లలు, వృద్ధుల్లో ఇది ఎక్కువగా సోకే అవకాశం ఉంది. 

 

మరిన్ని వార్తల కోసం 

కృష్ణ నీటిపై సర్కారు తీరుతో రాష్ట్రానికి నష్టం

రైల్వే ట్రాక్ లే వారి నివాసాలు