
బాలీవుడ్ స్వప్న సుందరిగా మాధురీ దీక్షిత్(Madhuri Dixit) ఇన్నేళ్లలో అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan)తో ఒక్క సినిమా కూడా చేయలేకపోయింది. బాలీవుడ్ దర్శకుడు టినూ ఆనంద్(Tinnu Anand) మాధురిపై చేసిన కామెంట్స్‌తో ఈ టాపిక్ మరోసారి వార్తల్లో నిలుస్తోంది.
1989లో తొలిసారిగా బిగ్‌బీ, మాధురి కాంబోలో శనక్త్( Shanakht) ప్లాన్ చేశారట. అయితే, మాధురి గొడవ వల్ల ఆ సినిమా షూటింగ్ మొదలైన ఐదో రోజే ఆగిపోయిందని ఈ దర్శకుడు వెల్లడించాడు. హీరో తన సర్వ శక్తులు ఒడ్డి హీరోయిన్ను కాపాడుతుంటాడు. దీంతో ఆమె అతడికి అన్నివిధాలుగా దగ్గరవ్వాలని కోరుకునే సీన్ అది. ఆ సీన్లో మాధురిని లో దుస్తుల్లో చూపించాలనుకున్నాం. దీనికి మొదట ఓకే అన్న ఆమె షూటింగ్ టైంలో రాద్దాంతం చేసింది. దీంతో, ఆమెతో నాకు గొడవ జరిగింది. ఆ సీన్లో నటించనంటూ తన బ్యాగ్ సర్దుకుని షూటింగ్ నుంచి వెళ్లిపోయింది.. అంటూ ఆనాటి విషయాలను టినూ ఆనంద్ షేర్ చేసుకున్నారు.
ఇదే విషయాన్ని అమితాబ్ బచ్చన్ కి వివరిస్తే..కో యాక్టర్స్ అసౌకర్యంగా ఫీల్ అయినప్ప్పుడు బలవంత పెట్టకూడదంటూ సూచించారు అని పేర్కోన్నారు. అయితే, ఈ సినిమాకి మాధురి సైన్ చేసే ముందు రొమాంటిక్ సీన్ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పానని టిన్ను ఆనంద్ తెలుపగా.. అలాగే, నెక్స్ట్ వేరే హీరోయిన్ కోసం ట్రై చేస్తున్నప్పుడు మాధురి సెక్రటరీ వచ్చి, అంగీకరించేలా చేస్తానని హామీ ఇచ్చిందని సమాచారం. అయితే, ఆ సహకారం వర్కవుట్ కాలేదు. దీంతో మాధురి, అమితాబ్ కలిసి మళ్లీ ఏ మూవీలో నటించలేదు.