పంటలు ఎండుతుంటే పండుగలు ఏంది?

పంటలు ఎండుతుంటే పండుగలు ఏంది?

అయిజ, వెలుగు: అలంపూర్  నియోజకవర్గంలో ఆర్డీఎస్  ఆయకట్టు కింద సాగు చేసిన పంటలు ప్రతి ఏటా ఎండుతుంటే స్పందించని పాలకులు, దశాబ్ది ఉత్సవాల పేరిట చెరువుల పండుగ ఎలా నిర్వహిస్తారని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఎంసీ కేశవరావు ప్రశ్నించారు. గురువారం అయిజ పట్టణంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్డీఎస్ ను ప్రక్షాళన చేయకుండా, 9 ఏళ్లుగా చెరువుల్లో తట్టెడు మట్టి ఎత్తకుండా, చెరువుల పండగ ఎలా నిర్వహిస్తారని నిలదీశారు. అలంపూర్ నియోజకవర్గన్ని ఎడారిగా మార్చి చెరువుల ఉత్సవాల పేరుతో ప్రజలను మభ్య పెడుతున్నారని ఆరోపించారు.

తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్  పరిధిలో వల్లూరు, మల్లమ్మకుంట, జూలకల్లు రిజర్వాయర్లు నిర్మించాలని సూచించారు. మిషన్ కాకతీయలో జరిగిన అవినీతి, అక్రమాలపై వైట్​ పేపర్​ రిలీజ్​ చేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్  పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు. మహేశ్, మధు గౌడ్, సుంకన్న, రవిచంద్ర, జిల్లా మహిళా కన్వీనర్ శారద, నాగరాజు, మహేందర్, రాజు, విజయ్, బుడ్డన్న, అభిరాం పాల్గొన్నారు.