నన్ను దూరం పెట్టడానికి మీకేం అధికారం ఉంది? ..కాంగ్రెస్ నేతకు శశి థరూర్ ప్రశ్న

నన్ను దూరం పెట్టడానికి మీకేం అధికారం ఉంది? ..కాంగ్రెస్ నేతకు శశి థరూర్ ప్రశ్న

న్యూఢిల్లీ: పార్టీ కార్యక్రమాలకు తనను దూరం పెడుతున్నామంటూ కాంగ్రెస్ నేత కె.మురళీధరన్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ శశిథరూర్ స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి వాదన చేయడానికి వారికి ఏం అధికారం ఉంది? పార్టీలో వారి స్థానం ఏంటనేది తెలుసుకోవాలి” అని అన్నారు.

 ఎంపీ శశి థరూర్ ఇటీవలి​ కామెంట్లు, కేంద్ర ప్రభుత్వానికి మద్ధతుగా మాట్లాడడం తదితర పరిణామాలపై మురళీధరన్‌‌‌‌‌‌‌‌ తాజాగా స్పందించారు. ఎంపీ శశిథరూర్‌‌‌‌ తన వైఖరి మార్చుకునే వరకు కాంగ్రెస్​ పార్టీ కార్యక్రమాలకు ఆయనను ఆహ్వానించబోమని మురళీధరన్‌‌‌‌‌‌‌‌ స్పష్టం చేశారు.