IPL 2026 Final: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఐపీఎల్ 2026 ఫైనల్ కి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. రజత్ పాటిదార్ కెప్టెన్సీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వరుసగా రెండోసారి ఫైనల్‌లోకి దూసుకెళ్లి హిస్టరీ క్రియేట్ చేయడానికి సిద్ధమైంది. డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగుతున్న ఆర్‌సీబీ ఆశలన్నీ ఎప్పటిలాగే కింగ్ విరాట్ కోహ్లీపైనే ఉన్నాయి. మరి ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు ఐపీఎల్ ఫైనల్స్ ప్రెజర్‌లో కోహ్లీ ట్రాక్ రికార్డ్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
కోహ్లీ ఐపీఎల్ ఫైనల్స్ జర్నీ:
కోహ్లీ ఇప్పటి వరకు ఆడిన 4 ఐపీఎల్ ఫైనల్స్ మ్యాచ్‌లలో 34.75 సగటుతో మొత్తం 139 రన్స్ మాత్రమే చేశాడు. కెరీర్ మొదటి పదేళ్లలో ఫైనల్స్ అంటే కోహ్లీకి కేవలం గుండెకోత మాత్రమే మిగిలింది. కానీ గత ఏడాది (2025) జరిగిన ఫైనల్ మ్యాచ్ అతని తలరాతను పూర్తిగా మార్చేసింది.
ఫైనల్స్‌లో కోహ్లీ రికార్డు:
* 2009 (ఆర్సీబీ vs డెక్కన్ చార్జర్స్): అప్పట్లో కోహ్లీ కేవలం ఒక టీనేజ్ బ్యాటింగ్ సెన్సేషన్ మాత్రమే.. ఆ ఫైనల్‌లో ఆర్‌సీబీ చేతుల్లో ఉన్న మ్యాచ్‌ను చేజార్చుకుని రన్నరప్‌గా నిలిచింది.
* 2011 (ఆర్సీబీ vs చెన్నై సూపర్ కింగ్స్): సీఎస్‌కే విధించిన భారీ టార్గెట్ ఛేజింగ్‌లో కోహ్లీ 35 పరుగులతో పోరాట పటిమ చూపించినా.. లాభం లేకుండా పోయింది. చెన్నై ఘన విజయం సాధించింది.
* 2012–2016 ( ఆర్సీబీ vs సన్‌రైజర్స్ హైదరాబాద్): 2016 ఫైనల్‌లో కోహ్లీ చెలరేగి ఆడి 35 బంతుల్లో 54 పరుగులు సాధించాడు. కానీ, డేవిడ్ వార్నర్ ఆర్మీ ఆర్‌సీబీ కప్ చెదరగొట్టింది.
* 2025 (ఆర్సీబీ vs పంజాబ్ కింగ్స్): గత ఏడాది ఫైనల్‌లో కోహ్లీ పరుగులు చేయడానికి కాస్త ఇబ్బంది పడ్డాడు. 35 బంతుల్లో 43 రన్స్ నెమ్మదైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు, అలాగే బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్, కృనాల్ పాండ్యా మ్యాజిక్ చేయడంతో ఆర్‌సీబీ ఎట్టకేలకు తమ ఫస్ట్ ఐపీఎల్ ట్రోఫీని దక్కించుకుంది.
ఫైనల్ లో ప్రెజర్లో కోహ్లీ నిజమేనా?:
ఐపీఎల్ హిస్టరీలోనే కోహ్లీ పరుగుల రారాజు అనడంలో ఎలాంటి సందేహం లేదు.. కానీ, నార్మల్ మ్యాచ్‌లతో పోలిస్తే ఫైనల్స్‌లో అతని అగ్రెసివ్ నెస్, కన్సిస్టెన్సీ కొంచెం తగ్గినట్లు పలు గణాంకాలు చెప్తున్నాయి.
* ఓవరాల్ కెరీర్‌లో 134+ స్ట్రైక్ రేట్ ఉన్న కోహ్లీ.. ఫైనల్స్ మ్యాచ్‌లకు వచ్చేసరికి 126.36 స్ట్రైక్ రేట్‌తో కాస్త నెమ్మదించాడు.
* గత ఏడాది ఫైనల్స్ (2025) లో కూడా ఫ్లాట్ పిచ్‌పై విరాట్ కోహ్లీ 35 బంతుల్లో 43 రన్స్ చేయడమే దీనికి ఉదాహరణ.
ఫైనల్ గేమ్ చేంజర్:
ఫైనల్స్ రికార్డ్స్ ఎలా ఉన్నా.. ఈసారి గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌లో కోహ్లీనే ఆర్‌సీబీకి లార్జర్- దన్ -లైఫ్ వెపన్. ఎందుకంటే గుజరాత్ టీమ్‌లో కగిసో రబాడ, మహమ్మద్ సిరాజ్ వంటి స్పీడ్‌తో భయపెట్టే ‘రా పేస్’ బౌలర్లు ఉన్నారు. కానీ కోహ్లీకి ఇలాంటి ఎక్స్‌ప్రెస్ పేస్‌ను ఎదుర్కోవడం వెన్నతో పెట్టిన విద్య.. ఈ ఐపీఎల్ 2026 సీజన్‌లో గుజరాత్‌పై కోహ్లీ ట్రాక్ రికార్డ్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. ఈ సీజన్‌లో గుజరాత్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల్లో కోహ్లీ ఏకంగా 82 బంతుల్లో 152 రన్స్ కొట్టాడు. రబడా, సిరాజ్ వేసే పవర్‌ప్లే ఓవర్లలోని స్పీడ్‌ను కోహ్లీ గనుక ఈజీగా న్యూట్రలైజ్ చేస్తే.. అహ్మదాబాద్ గ్రౌండ్‌లో పరుగుల వరద పారడం ఖాయం.
►ALSO READ | అయ్యో పాపం.. IPL 2026 ఫైనల్కి ముందు ఆర్సీబీకి బిగ్ షాక్
