రూ.2 కోట్లు పలికిన దావూద్ ప్రాపర్టీస్.. కొన్నది ఒక్కరే

  రూ.2 కోట్లు పలికిన దావూద్ ప్రాపర్టీస్..  కొన్నది ఒక్కరే

 అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన నాలుగు ఆస్తులను అధికారులు వేలం వేశారు.  ఇందులో రెండు ఆస్తులను ఒక్కరే దక్కి్ంచుకోగా మరో రెండిటిని కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇందులో 170.98 చ.మీల స్థలానికి కనీస ధర రూ.15,440గా నిర్ణయించగా.. ఏకంగా రూ.2.01 కోట్లు పలకడం గమనార్హం. రూ.1.56 లక్షలుగా నిర్ణయించిన మరో ప్లాట్‌ (1730 చ.మీలు).. రూ.3.28 లక్షలకు అమ్ముడుపోయింది.  స్మగ్లర్లు, ఫారిన్‌ ఎక్సే్ఛంజి మానిప్యులేటర్స్‌ చట్టం కింద ముంబైలోని ఆయకార్‌ భవనంలో వేలం చేపట్టారు.   ఈ రెండింటిని ఢిల్లీకి చెందిన లాయర్‌ కొనుగోలు చేశారు.  

1993 ముంబై వరుస పేలుళ్లలో కీలక నిందితుడైన దావూద్ ఇబ్రహీం 1983లో ముంబైకి వెళ్లడానికి ముందు తన సొంత గ్రామంలో నివసించాడు. 257 మంది మరణానికి కారణమైన బాంబు పేలుళ్ల తర్వాత అతను  దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. మార్చి 12, 1993న జరిగిన ముంబై పేలుళ్లతో దద్దరిల్లింది,  ఈఘటనలో 257 మంది మరణించగా...  700 మందికి పైగా గాయపడ్డారు. కాగా  గడిచిన 9 ఏళ్లలో దావూద్‌, అతని కుటుంబ సభ్యులకు సంబంధించిన 11 ఆస్తులను అధికారులు వేలం వేసిన విషయం తెలిసిందే. వాటిల్లో ఒక రెస్టారెంట్‌ను రూ.4.53 కోట్లు, ఆరు ఫ్లాట్లు రూ.3.53 కోట్లకు, గెస్ట్‌ హౌస్‌ రూ.3.52 కోట్లకు అమ్ముడుపోయాయి.