అమెరికా లేకుంటే మీకు రక్షణేది? ఈయూకు నాటో చీఫ్ హెచ్చరిక

అమెరికా లేకుంటే మీకు రక్షణేది? ఈయూకు నాటో చీఫ్ హెచ్చరిక

బ్రస్సెల్స్: అమెరికా మిలటరీ సాయం లేకుండా యూరప్ తనను తాను రక్షించుకోలేదని నాటో చీఫ్ మార్క్ రుట్టే హెచ్చరించారు. అమెరికాను కాదని యూరప్ సొంతంగా ముందుకెళ్తే.. మిలటరీపై ఇప్పుడు పెడ్తున్న దానికి రెట్టింపు ఖర్చు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.

 బెల్జియంలోని బ్రస్సెల్స్‌‌లో యురోపియన్ యూనియన్ చట్టసభ సభ్యులతో సోమవారం జరిగిన సమావేశంలో మార్క్ రుట్టే ఈ వ్యాఖ్యలు చేశారు.