అసియా కప్ ఫైనల్ మ్యాచ్లో వర్షం పడితే ఎలా?.. గతంలో జరిగితే ఏం చేశారు

అసియా కప్ ఫైనల్ మ్యాచ్లో వర్షం పడితే ఎలా?..   గతంలో జరిగితే ఏం చేశారు

భారత్, శ్రీలంక జట్ల మధ్య 2023 సెప్టెంబర్ 17 ఆదివారం రోజున  ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.  ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు ఉందని ఇప్పటికే  అక్కడి వాతావరణ శాఖ వెల్లడించింది.  కొలంబోలో ఆదివారం 80% వర్షం కురిసే అవకాశం ఉందని, మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 7 గంటల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 

ఒకవేళ మ్యాచ్ జరిగే రోజున వర్షం పడితే మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 18 రోజున  (రిజర్వ్ డే ) మ్యాచ్ ను నిర్వహించనున్నారు.  ఒకవేళ రిజర్వ్ డే  రోజున కూడా వర్షం కురిసి మ్యాచ్ నిర్వహణకు  అడ్డుపడితే ఇరుజట్లను విజేతలుగా ప్రకటిస్తారు. 2002లో వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే ఇరుజట్లను విజేతలుగా ప్రకటించారు.  

ALSO READ: ఫైనల్​ ముందు పల్టీ..బంగ్లా చేతిలో పోరాడి ఓడిన ఇండియా
 

శ్రీలంకలో 2002లో ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది. ఈ టోర్నీలో చాలా మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగించింది. ట్రోఫీ చివరి మ్యాచ్ భారత్ ..  శ్రీలంక మధ్య జరగాల్సి ఉంది. కానీ వర్షం కారణంగా ఆగిపోయింది.  రిజర్వ్ డే రోజు కూడా మ్యాచ్ నిర్వహించబడలేదు.   దీంతో  చివరకు మ్యాచ్ రద్దైంది. దీంతో ఇండియా, శ్రీలంక జట్లను జాయింట్ విజేతలుగా ప్రకటించారు.