36లక్షల ఖాతాలను తొలగించిన వాట్సాప్

36లక్షల ఖాతాలను తొలగించిన వాట్సాప్

కొత్త ఐటీ రూల్స్ 2021కు అనుగుణంగా మెటా యాజమాన్యం మెసేజింగ్ యాప్ వాట్సాప్ విషయంలో తీసుకున్న ఓ సంచలన విషయాన్ని బయటపెట్టింది. గతేడాది డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 మధ్య కాలంలో 36.77 లక్షల ఖాతాలను నిషేధించినట్టు వాట్సాప్ ప్రకటించింది. నిబంధనలు ఉల్లంఘించిన ఈ వినియోగదారులకు వాట్సప్ ఎలాంటి నోటీసులు జారీ చేయకుండానే వారి అకౌంట్లను తొలగించడం విశేషం. నెలవారీ నివేదికలో భాగంగా 2021 ఐటీ నిబంధనలు ప్రకారం ఆ ఖాతాలను తొలగించామని వాట్సప్ స్పష్టం చేసింది. వాట్సప్ కు ప్రపంచవ్యాప్తంగా 400 మిలియన్ల కన్నా ఎక్కువ మంది యూజర్లున్నారు.