వాట్సాప్‌– బీజేపీ లింక్స్ బయటపడ్డాయి

వాట్సాప్‌– బీజేపీ లింక్స్ బయటపడ్డాయి

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ సర్కార్‌‌పై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్‌ గాంధీ మరోమారు విరుచుకుపడ్డారు. ప్రముఖ టైమ్ మేగజీన్‌లో సోషల్ మీడియా దిగ్గజమైన ఫేస్‌బుక్‌తో అధికార బీజేపీకి ఉన్న సంబంధాలపై వచ్చిన ఆర్టికల్‌ ఆధారంగా విమర్శలు గుప్పించారు. అమెరికాకు చెందిన టైమ్ మేగజీన్ వాట్సాప్‌–బీజేపీకి ఉన్న సంబంధాల గురించి బయటపెట్టిందన్నారు. వాట్సాప్‌ను 40 కోట్ల మంది భారతీయులు వాడుతున్నారని చెప్పారు. వాట్సాప్ కూడా తనను వినియోగించుకోవాలనే చూస్తోందని, ఎందుకంటే పేమెంట్స్ కోసం మోడీ సర్కార్ అనుమతి తప్పనిసరి అని రాహుల్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు టైమ్‌ మేగజీన్‌ ప్రచురించిన ఆర్టికల్‌ను జత చేశారు. వాట్సాప్‌పై బీజేపీకి పట్టు ఉందని ఆరోపించారు. పలువురు బీజేపీ లీడర్లు చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలను నిలువరించడంలో ఫేస్‌బుక్ ఎలా విఫలమైందనే విషయాన్ని టైమ్ మేగజీన్‌ సదరు ఆర్టికల్‌లో వివరించింది.