
ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ని మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చేందుకు ఒక కొత్త ఫీచర్‌ని ప్రవేశపెట్టింది. ఇప్పుడు యూజర్లు AI సహాయంతో స్టేటస్ కోసం ఫోటోలను క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ మెటా లేటెస్ట్ జనరేటివ్ AI టెక్నాలజీపై ఆధారపడి ఉందని, దీని సహాయంతో టెక్స్ట్ టైప్ ద్వారా ఫోటోస్ క్రియేట్ చేయవచ్చని కంపెనీ తెలిపింది. అంటే ఇప్పుడు మీరు మీ స్టేటస్ కోసం ఫోటోలను డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు, సెర్చ్ చేయాల్సిన పని ఉండదు, మీకు కావలసిన ఫోటో వివరణ (ప్రాంప్ట్) రాసిస్తే, AI దాన్ని కొన్ని సెకన్లలో సృష్టిస్తుంది.
ఈ ఫీచర్ ఉపయోగించడం కూడా చాలా ఈజీ. ఇందుకు ముందుగా వాట్సాప్ ఓపెన్ చేసి అప్‌డేట్స్ ట్యాబ్‌కి వెళ్లాలి. ఇక్కడ కొత్త AI ఇమేజెస్ ఆప్షన్ స్టేటస్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. దానిపై ట్యాప్ చేసిన తర్వాత, ఒక టెక్స్ట్ బాక్స్ తెరుచుకుంటుంది, అందులో మీకు ఇష్టమైన ఇమేజ్ కోసం ప్రాంప్ట్‌ను టైప్ చేయాలి. ఉదాహరణకు బీచ్‌లో కూర్చున్న జంట లేదా ఆకాశంలో ఎగురుతున్న రాకెట్... మెటా AI ఆ ప్రాంప్ట్ ఆధారంగా రకరకాల ఫోటోలను రూపొందించి చూపిస్తుంది. ఇప్పుడు మీకు ఇష్టమైన ఇమేజ్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా కొత్త ప్రాంప్ట్ ఎడిట్ చేసిన ఇమేజ్ సృష్టించవచ్చు.
ఇంకా ఫోటో క్రియేట్ చేసిన తర్వాత మీరు దానిని మీకు నచ్చినట్లు కస్టమైజ్ చేసుకోవచ్చు. దీనికి క్యాప్షన్స్, స్టిక్కర్లు లేదా టెక్స్ట్ కూడా కలిపే అప్షన్ ఉంటుంది. send పై నొక్కడం వల్ల ఫోటో మీ WhatsApp స్టేటస్ కి అప్‌లోడ్ అవుతుంది.
ప్రస్తుతం, ఈ AI ఫీచర్ అప్షన్ కొందరికి కోసం మాత్రమే విడుదల చేసింది, అయితే రాబోయే వారాల్లో Android, iOS యూజర్ల కోసం తీసుకొస్తామని కంపెనీ పేర్కొంది. ఈ ఫీచర్ WhatsAppలో కంటెంట్ షేరింగ్, పర్సనలైజేషన్ రెండింటినీ మారుస్తుందని టెక్ నిపుణులు అంటున్నారు.
మెటా గతంలో చాల యాప్‌లకు AI- ఫీచర్స్ తీసుకొచ్చింది. ఈ ఫీచర్ సమయాన్ని ఆదా చేయడమే కాకుండా మీ స్టేటస్ చాల ప్రత్యేకంగా చేస్తుంది.