ఆదిపురుష్ మూవీపై కుట్ర జరుగుతోందా.. ఏంటీ ప్రచారం

ఆదిపురుష్ మూవీపై కుట్ర జరుగుతోందా.. ఏంటీ ప్రచారం

మరికొన్ని రోజుల్లో అనేకంటే.. మరికొన్ని గంటల్లో జూన్ 16వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ మూవీ విడుదల కానుంది. ఫ్యాన్స్ కు అతీతంగా.. భాషలకు అతీతంగా.. కులాలు, మతాలకు అతీతంగా రాముడి గాథను అద్భుత దృశ్యకావ్యంగా వెండి తెరపై ఆవిష్కరించబోతున్న సినిమా ఆదిపురుష్. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పిల్లా, పెద్దలు అందరూ ఈ సినిమా చూడాలనే ఉత్సాహం చూపిస్తున్న సమయంలో..  కొన్ని దుష్టశక్తులు ఆదిపురుష్ మూవీపై దుష్ట ప్రచారం మొదలుపెట్టాయి. సినిమాకు వెళ్లే సమయంలో ఇలాంటి నియమాలు పాటించాలంటూ వాట్సాప్ మెసేజ్ లు ద్వారా.. ఆదిపురుష్ మూవీపై తప్పుడు ప్రచారం మొదలుపెట్టాయి. 

ప్రచారం ఎలా సాగుతుంది అంటే:

  • మందు కొట్టి, మాంసం తిని థియోటర్లకు వెళ్లకూడదు.
  • చెప్పులు వేసుకుని ఆదిపురుష్ థియోటర్లకు వెళ్లకూడదు.
  • థియోటర్లకు ప్రభాస్ కనిపించినప్పుడు ఈలలు వేయకూడదు.. జై కొట్టకూడదు.
  • టీ షర్ట్, జీన్స్ ధరించి సినిమా థియోటర్లకు వెళ్లకూడదు.
  • వీలైతే కాషాయ వస్త్రాలు ధరించి థియోటర్లకు వెళ్లాలి.
  • వీలైతే థియోటర్లకు దగ్గర టెంకాయలు కొట్టి లోపలికి వెళ్లాలి.
  • హనుమంతుడికి కేటాయించిన సీటు దగ్గర ధూపం వేయాలి.. దీపం వెలిగించాలి.. పూలు వేయాలి.
  •  జై శ్రీరాం నామస్మరణ మాత్రమే చేయాలి. 
  •  

ఇది తప్పుడు ప్రచారం:

వాట్సాప్, సోషల్ మీడియాలో ఆదిపురుష్ మూవీపై జరుగుతున్న ప్రచారం అంతా తప్పు అంటున్నారు థియోటర్ యాజమాన్యాలు. ఎలాంటి నిబంధనలు లేవని.. తప్పుడు ప్రచారం చేస్తున్నారనేది వాళ్లు చెబుతున్న మాట. ప్రభాస్ మూవీ ఆదిపురుష్ పై కొందరు కావాలనే కుట్ర చేస్తున్నారని.. థియోటర్లకుప్రేక్షకులు రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు అనేది యాజమాన్యాలు మాట. వాట్సాప్, సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని ఎవరూ నమ్మొద్దని వారు చెబుతున్నారు. ఇదంతా ఫేక్ అంటున్నారు సినిమా ఇండస్ట్రీ వాళ్లు కూడా. 

సో వాట్సాప్, సోషల్ మీడియాలో ఆదిపురుష్ మూవీపై వస్తున్న నిబంధనల ప్రచారం ఉత్తిదే అని తేలిపోయింది కాబట్టి.. మీరు హ్యాపీగా థియోటర్ కు వెళ్లి సినిమా చూసి.. విజ్ణానం పెంపొందించుకోండి.. రేపటి తరానికి రాముడి గురించి చెప్పండి.. ఆచరించండి..