వాట్సాప్‌‌లోనూ క్యాష్‌‌బ్యాక్‌‌

వాట్సాప్‌‌లోనూ క్యాష్‌‌బ్యాక్‌‌

ప్రస్తుతం సోషల్‌‌ మీడియాదే ట్రెండ్‌‌. వాట్సాప్‌‌, ట్విట్టర్‌‌‌‌, యూట్యూబ్‌‌ ఎప్పటికప్పుడు అప్‌‌డేట్స్‌‌ ఇస్తూ యూజర్స్‌‌ను అట్రాక్ట్‌‌ చేస్తున్నాయి.కొత్త కొత్త ఆప్షన్స్‌‌ ఇచ్చి యూజర్‌‌‌‌ ఫ్రెండ్లీగా మారుతున్నాయి. వీడియోలకు సంబంధించి అప్‌‌డేట్‌‌ ఇచ్చింది యూట్యూబ్‌‌. పేమెంట్స్‌‌కి సంబంధించిన అప్‌‌డేట్స్‌‌తో వచ్చేశాయి ట్విట్టర్‌‌‌‌, వాట్సాప్‌‌.

ఇప్పటి డిజిటల్‌‌ వరల్డ్‌‌లో గూగుల్‌‌ పే, ఫోన్‌‌ పే లాంటి పేమెంట్‌‌ యాప్స్‌‌తో పోటీ పడేందుకు వాట్సాప్‌‌ బాగా ట్రై చేస్తోంది. మనదేశంలో కొత్తగా పేమెంట్స్‌‌ ఆప్షన్‌‌ను తీసుకొచ్చింది. దాన్ని జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది వాట్సాప్‌‌. ఈ మేరకు క్యాష్‌‌ బ్యాక్‌‌ ఆఫర్లు, కూపన్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించి బ్యాకెండ్‌‌ వర్క్‌‌ చేస్తోందని డబ్ల్యూబీటాఇన్‌‌ఫో చెప్పింది. పది రూపాయలు అంతకంటే ఎక్కువ క్యాష్‌‌ బ్యాక్‌‌ ఇచ్చేలా ప్లాన్‌‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, 48 గంటల తర్వాత ఆ డబ్బులు అకౌంట్‌‌లో క్రెడిట్‌‌ అవుతాయట. దాంతోపాటు గ్రూప్‌‌ చాట్‌‌, ఐకాన్‌‌, గ్రూప్‌‌ ఇన్‌‌ఫో డిస్‌‌ప్లేలో కూడా మార్పులు తెస్తున్నట్లు చెప్పింది.