పొల్యూషన్‎లో ప్రపంచంలోనే నెం.1 కంట్రీగా పాకిస్తాన్.. ఇండియా స్థానమెంతటే..?

పొల్యూషన్‎లో ప్రపంచంలోనే నెం.1 కంట్రీగా పాకిస్తాన్.. ఇండియా స్థానమెంతటే..?

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత ఎయిర్​ పొల్యూషన్​ఉన్న దేశాల్లో పాకిస్తాన్ తొలిస్థానంలో నిలిచింది. 2025 సంవత్సరానికి సంబంధించిన స్విట్జర్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ఐక్యూఎయిర్​అనే  సంస్థ  గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వాలిటీ నివేదికను మంగళవారం రిలీజ్​ చేసింది. ఈ నివేదిక ప్రకారం పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య దేశంగా నిలిచింది. దక్షిణాసియాలో గాలి కాలుష్యం తీవ్రంగా పెరుగుతున్నట్లు నివేదిక స్పష్టం చేసింది.

 పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పీఎం2.5 (సూక్ష్మ ధూళి కణాలు) స్థాయిలు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) నిర్దేశించిన పరిమితుల కంటే సుమారు 13 రెట్లు ఎక్కువగా నమోదయ్యాయి. ఇవి శ్వాసకోశ, గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన కారణంగా చెబుతున్నారు.  కాగా, యూపీలోని ‘లోని’ సిటీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది. ఓవరాల్‎గా ఈ జాబితాలో ఇండియా ఆరో స్థానంలో ఉంది.