ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

వీపనగండ్ల, వెలుగు: వీపనగండ్ల–గోవర్ధనగిరి బీటీ రోడ్డు పనుల విషయంలో కాంట్రాక్టర్‌‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సీపీఎం, కాంగ్రెస్  నేతలు , గ్రామస్తులు మండిపడ్డారు. బుధవారం పింఛన్ల పంపిణీ కోసం వీపనగండ్లకు వస్తున్న  ప్రజాప్రతినిధులను అడ్డుకొని ధర్నా చేశారు.  రోడ్డు మంజూరై ఏడేండ్లైనా పనులు చేయడం లేదని,  గుంతలు, కంకర రోడ్డుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. కాగా, పోలీసులు ఆందోళన కారులను పక్కకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. ఉద్రిక్తత నెలకొంది. ఇదే సమయంలో  ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్​రెడ్డి అక్కడికి చేరుకోవడంతో కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. స్పందించిన ఎమ్మెల్యే కాంట్రాక్టర్‌‌తో ఫోన్లో మాట్లాడి వారం రోజుల్లో పనులు చేపట్టకపోతే టెండర్ క్యాన్సిల్ చేస్తాని హెచ్చరించారు.  నేతలు  ఈశ్వర్, జక్కుల ఆశన్న, నక్క ఆంజనేయులు, రామకృష్ణ,  శ్రీను, రామన్ గౌడ్, నరసింహ, వెంకటరెడ్డి, నక్క విష్ణు, ఎల్లయ్య శేఖర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, నరసింహ, చిన్న ఊషన్న పాల్గొన్నారు.

తొలి వేతనం బడి కోసం..

వాటర్‌‌ ఫిల్టర్‌ డొనేట్ చేసిన కానిస్టేబుల్‌

మరికల్, వెలుగు :  మండలంలోని తీలేరుకు చెందిన కానిస్టేబుల్‌ రామాంజనేయులు తాను చదువుకున్న బడి కోసం తొలి వేతనాన్ని ఖర్చు చేశారు. గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో రూ.25 వేలతో వాటర్‌‌ ఫిల్టర్‌‌ ఏర్పాటు చేయించారు.  దీన్ని బుధవారం సీఐ రాంలాల్​, ఎస్సై అశోక్​బాబు ప్రారంభించారు.   రామాంజనేయులును స్పూర్తిగా తీసుకుని చదువుకున్న బడికి ఏదో రకంగా సాయం అందించాలని సీఐ సూచిచంఆరు. ఎంపీటీసీ సునీత, ఉపసర్పంచి బజారప్ప, గ్రామస్తులు అశోక్​కుమార్​, రవికుమార్ ఉన్నారు.

శ్రీరంగాపూర్​ మహిళా సమాఖ్యలో అవినీతి

శ్రీరంగాపూర్, వెలుగు:  శ్రీరంగాపూర్​ మండల సమాఖ్యలో అవినీతి జరుగుతోందని ఎంపీటీసీ ఎల్లస్వామి  ఆరోపించారు.  బుధవారం ఎంపీపీ గాయత్రి పృథ్విరాజ్‌ అధ్యక్షతన జనరల్​ బాడీ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా తాటిపాముల ఎంపీటీసీ పార్వతమ్మ మాట్లాడుతూ తన గ్రామంలో మహిళా సంఘానికి సంబంధించిన రూ.1.70 వేలను  బుక్​ కీపర్ కాజేసారని సభ దృష్టికి తెచ్చారు. ఈ అంశంపై ఇదివరకే  చర్చలు జరిపగా.. విడుతల వారీగా రికవరీ చేస్తామని అధికారులు చెప్పారన్నారు.  శ్రీరంగాపూర్​ ఎంపీటీసీ ఎల్లస్వామి మాట్లాడుతూ  తాటిపాములతో పాటు మండలంలోని అన్ని గ్రామాలలో ఇదే పరిస్థితి ఉందని ఆరోపించారు.  మండల సమాఖ్య అధికారులు ఇష్టారాజ్యంగా వ్యహరిస్తున్నారని మండిపడ్డారు.   వెంటనే విచారణ చేపట్టి బాధ్యులైన అధికారులను సస్పెండ్​ చేయాలని  డిమాండ్​ చేశారు.

పట్టాల కోసం రైతుల పాదయాత్ర

మద్దతుగా నిలిచిన సీపీఎం, ప్రజాసంఘాలు 

కొల్లాపూర్​(నాగర్​కర్నూల్​), వెలుగు:  60 ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలివ్వకుండా సతాయిస్తున్నారని కొల్లాపూర్​మండలం మొలచింతల పల్లి,  అస్మత్​పూర్‌‌కు చెందిన రైతులు మండిపడ్డారు. బుధవారం సీపీఎం, రైతు సంఘం ఆధ్వర్యంలో దాదాపు150 మంది రైతులు కొల్లాపూర్‌‌ వరకు 16 కి.మీ. పాదయాత్ర నిర్వహించారు.​  మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహ్మరెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్దనం పర్వతాలు, జాన్​వెస్లీ, శివవర్మ, శ్రీనివాసులు, తారాసింగ్​,శంకర్​నాయక్‌ ఆధ్వర్యంలో కొల్లాపూర్ ఆర్డీవోను కలిసి గోడు వెల్లబోసుకున్నారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొల్లాపూర్​రాజులకు మొలచింతల పల్లి,  అస్మత్​పూర్​ వద్ద  1000 ఎకరాల భూములు ఉండగా..  600 ఎకరాలు కృష్ణాలో ముంపునకు గురయ్యాయన్నారు.  400 ఎకరాలను  150 మంది రైతులు 60 ఏండ్లుగా సాగు చేసుకుంటున్నారని చెప్పారు. ఈ  భూములు తమవంటే తమని ఫారెస్ట్​ ఆఫీసర్లు, రెవెన్యూ శాఖలు ఓ వైపు,  రాజవంశస్తులు మరోవైపు వాదిస్తూ..  రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే రైతులకు పట్టాలివ్వాలని, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 

శ్రీరంగాపూర్​ మహిళా సమాఖ్యలో అవినీతి

శ్రీరంగాపూర్, వెలుగు:  శ్రీరంగాపూర్​ మండల సమాఖ్యలో అవినీతి జరుగుతోందని ఎంపీటీసీ ఎల్లస్వామి  ఆరోపించారు.  బుధవారం ఎంపీపీ గాయత్రి పృథ్విరాజ్‌ అధ్యక్షతన జనరల్​ బాడీ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా తాటిపాముల ఎంపీటీసీ పార్వతమ్మ మాట్లాడుతూ తన గ్రామంలో మహిళా సంఘానికి సంబంధించిన రూ.1.70 వేలను  బుక్​ కీపర్ కాజేసారని సభ దృష్టికి తెచ్చారు. ఈ అంశంపై ఇదివరకే  చర్చలు జరిపగా.. విడుతల వారీగా రికవరీ చేస్తామని అధికారులు చెప్పారన్నారు.  శ్రీరంగాపూర్​ ఎంపీటీసీ ఎల్లస్వామి మాట్లాడుతూ  తాటిపాములతో పాటు మండలంలోని అన్ని గ్రామాలలో ఇదే పరిస్థితి ఉందని ఆరోపించారు.  మండల సమాఖ్య అధికారులు ఇష్టారాజ్యంగా వ్యహరిస్తున్నారని మండిపడ్డారు.  వెంటనే విచారణ చేపట్టి బాధ్యులైన అధికారులను సస్పెండ్​ చేయాలని  డిమాండ్​ చేశారు.

మెడికల్ కాలేజీ పనులకు బ్రేక్!

  •     పరిహారం ఇవ్వలేదని హైకోర్టును ఆశ్రయించిన బాధితుడు 
  •     పనులు ఆపాలని కలెక్టర్​,ఆర్డీవో, తహసీల్దార్‌‌కు నోటీసులు 

నాగర్​ కర్నూల్, ​వెలుగు: నాగర్​ కర్నూల్​ మెడికల్​ కాలేజీ పనులకు బ్రేక్ పడింది.  పరిహారం చెల్లించకుండా తన భూమి తీసుకున్నారని కొక్కనూరి మధు అనే దళితుడు హైకోర్టును ఆశ్రయించగా తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.​ ఉయ్యాలవాడ సమీపంలోని సర్వే నెం.237లో దళితులకు సంబంధించిన 77 ఎకరాల అసైన్డ్​ పట్టా భూముల్లో నుంచి  40 ఎకరాలు సేకరించిన అధికారులు.. 33 ఎకరాలు కాలేజీకి కేటాయించారు. అయితే భూసేకరణ  ప్రైవేట్ వ్యక్తుల చేతుల మీదుగా జరగడంతో వివాదం నెలకొంది.  వాళ్లే బాధితులతో ఫారం 6 మీద  సంతకాలు పెట్టించి.. గవర్నమెంట్‌కు సరెండర్​ చేయించారు. నిరుడు అడిషనల్ కలెక్టర్​(రెవెన్యూ) చాంబర్‌‌లో సంతకాల  ప్రక్రియ ముగిసిన తర్వాత  డబ్బులు చెల్లించారు. కాగా, రెవెన్యూ అధికారులు చట్టాలను విస్మరించి.. బాధితులకు నోటీసులు ఇవ్వకుండా, పరిహారం చెల్లించకుండా భూసేకరణ చేయడంపై రైతు మధు కోర్టుకు వెళ్లాడు. 

ఎక్సైజ్ ఆఫీసులో మాఫియా లీడర్ హల్‌చల్

రూ. కోట్లు కడుతున్నా తనిఖీలేంటని మండిపాటు

గద్వాల, వెలుగు:  గద్వాల ఎక్సైజ్ సర్కిల్ ఆఫీస్‌లో కల్లు, లిక్కర్ మాఫియా లీడర్ బుధవారం హల్‌చల్ చేశారు.  రూ. కోట్లు  కడుతున్నా తనిఖీల పేరుతో ఎందుకు వేధిస్తున్నారని, బైండోవర్లు ఎందుకు చేస్తున్నారని ఆఫీసర్లను నిలదీశారు.  ఓ ఆఫీసర్ పై చేయి చేసుకునే వరకు వెళ్లాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.  వివరాల్లోకి వెళ్తే..  గద్వాల టౌన్‌లో అయిజ రోడ్డులో ఉన్న వైన్స్ దగ్గర చికెన్, మటన్ షాపులు నిర్వహించే వారిని ఎక్సైజ్ పోలీసులు రెండు రోజుల క్రితం బైండోవర్ చేశారు. మరికొందరిని కూడా బైండోవర్ చేస్తామని చెప్పారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని అధికార పార్టీకి చెందిన నేత శ్రీధర్ గౌడ్‌ బుధవారం 20 మందిని వెంట పెట్టుకొని ఎక్సైజ్‌ ఆఫీసుకు వెళ్లాడు. తాను ఏటా రూ. కోట్లు కడుతున్నానని, అయినా ఇబ్బందులు పెట్టడం 
ఏంటని మండిపడ్డారు.  ఈ విషయంపై ఎక్సైజ్ సీఐ గోపాల్‌ను వివరణ కోరగా.. ఆఫీసుకు వచ్చిన మాట వాస్తవమేనని,  బైండోవర్‌‌ ఎందుకు చేస్తున్నారని అడిగారని చెప్పారు. ఆఫీస్‌లోకి నలుగురు మాత్రమే వచ్చారని సర్ది చెప్పి పంపామన్నారు. 

సీజ్‌ చేసిన డీసీఎంలో బెల్లం తరలింపు

  •  వాగులో పారబోసి తిరిగి వస్తుండగా యాక్సిడెంట్
  •  నలుగురికి గాయాలు..  ఒకరికి సీరియస్​ 

కల్వకుర్తి, వెలుగు: నల్లబెల్లం తరలిస్తున్న డీసీఎంను సీజ్ చేసిన కల్వకుర్తి ఎక్సైజ్ ఆఫీసర్లు.. బెల్లాన్ని పారబోసేందుకు అదే డీసీఎంను వినియోగించారు.  వాగులో పారబోసి తిరిగి వస్తుండగా.. లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు ఉద్యోగులు, ఇద్దరు హమాలీలు గాయపడ్డారు.  వివరాల్లోకి వెళ్తే..  కల్వకుర్తి సర్కిల్​పరిధిలో పట్టుబడ్డ బెల్లాన్ని మంగళవారం గతంలో సీజ్‌ చేసిన డీసీఎంలో నింపి వంగూరు మండలం డిండిచింతపల్లి సమీపంలో దుందుభి వాగులో పార బోయించారు.  రాత్రి సమయంలో తిరిగి వస్తుండగా వెనక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్యామేజీ అవడంతో పాటు కాంట్రాక్ట్ డ్రైవర్‌‌, ఎక్సైజ్ కానిస్టేబుల్, ఇద్దరు హమాలీలకు గాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు.  డీసీఎం ముందర  నెంబర్​ ప్లేట్ తీసేసి వెనకాల​ నెంబర్ కనిపించకుండా పాత బట్టలు అడ్డంగా పెట్టడం గమనార్హం. కాగా,  సీజ్​ చేసిన డీసీఎంను ఎలా వాడుతారని  కల్వకుర్తి ఎక్సైజ్​ సీఐని వివరణ కోరగా.. పైఆఫీసర్ల పర్మిషన్‌తో వాడుకున్నామని సమాధానం ఇచ్చారు.  నాగర్ కర్నూల్​ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ను వివరణ కోరగా.. సీజ్​ చేసిన వెహికల్‌ను వాడే అధికారం తమకు లేదని,  తాను ఎలాంటి పర్మిషన్‌ ఇవ్వలేదని చెప్పారు.  యాక్సిడెంట్ చేసిన లారీని ఎక్సైజ్‌ ఎస్సై ఫిర్యాదుతో  పోలీసులు కేస్ బుక్​ చేసి  స్టేషన్‌కు తరలించారు. డీసీఎంను ఎక్పైజ్​ స్టేషన్‌లో ఉంచారు. 

ఎఫ్​ఐఆర్​లో మెన్షన్​ చేస్తం 

ఎక్సైజ్​ఆఫీసర్లు సీజ్​చేసిన డీసీఎం వాడిన అంశాన్నీ కేసులో మెన్షన్​ చేస్తం.  కల్వకుర్తి ఎక్పైజ్​ఎస్సై ఫిర్యాదుతో కేస్​ రిజిస్ట్రర్ చేశాం.  ఈ విషయాన్ని  ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినం.  

–సైదులు, కల్వకుర్తి సీఐ 

కిక్ బాక్సింగ్ పోటీలకు మాస్టర్ మైండ్స్ స్టూడెంట్

వనపర్తి టౌన్, వెలుగు: వనపర్తి మాస్టర్ మైండ్స్ హైస్కూల్ స్టూడెంట్ జి.రుద్ర అంతర్జాతీయ కిక్ బాక్సింగ్  పోటీలకు ఎంపికయ్యాడు.  ఈ నెల 17,18 తేదీల్లో మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో రాష్ట్ర కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో వనపర్తి గోజురియో కరాటే, కిక్ బాక్సింగ్ అకాడమీ ఆధ్వర్యంలో రుద్ర  పాల్గొన్నారు. కిక్ లైట్ 12 ఇయర్స్ 37 కేజీల జూనియర్స్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించి అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ మేరకు బుధవారం స్కూల్ హెచ్ఎం ఎం.గౌతమ్ కుమార్  రుద్రను  అభినందించారు.  నవంబర్ నెలలో  ఢిల్లీలో జరగబోయే అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ పోటీలలో పాల్గొంటాడని ప్రిన్సిపాల్ తెలిపారు.

పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి

నారాయణపేట, వెలుగు:  దళితబంధు లబ్ధిదారులు యూనిట్లను సద్వినియోగం చేసుకొని పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ  కార్యదర్శి విజయ్ కుమార్ సూచించారు. బుధవారం కలెక్టరేట్ మీటింగ్‌ హాల్‌లో ఎస్సీ డెవలప్‌మెంట్ శాఖ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా  లబ్ధిదారులు ఎంచుకున్న యూనిట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  దళితులు ట్రాన్స్‌పోర్ట్‌ రంగంతో పాటు ఆయుర్వేదిక్‌ ప్లాంట్స్,  డెయిరీ, ఫిషరీస్‌  ప్లాంట్స్‌ పెట్టుకోవచ్చన్నారు. దళితబంధు పేరిట ప్రభుత్వం యాప్‌ను ఏర్పాటు చేసిందని, లబ్ధిదారులకు ఏమైనా ఇబ్బందులు ఇందులో సబ్మిట్ చేయవచ్చన్నారు. సలహాలు కావాలన్నా ఈ యాప్‌లో పొందుపరిచామని చెప్పారు. కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన వారికి దళిత బంధు ఇస్తున్నామని చెప్పారు. ఇప్పటికే ఫర్టిలైజర్, సప్లయర్స్‌ తదితర రంగాలలో  పెట్టుబడులు పెట్టించామన్నారు.   

దళితబంధు ఇవ్వాలని ఎమ్మెల్యేను అడ్డుకున్నరు

ఊట్కూర్, వెలుగు: దళిత బంధు, మూడెకరాల భూమి, డబుల్‌ బెడ్ రూమ్స్‌ ఇవ్వాలని ఊట్కూరు మండలం పెద్ద జట్రం  గ్రామ దళిత మహిళలు డిమాండ్ చేశారు. బుధవారం గ్రామంలోని లబ్ధిదారులకు పింఛన్‌ ప్రోసిడింగ్స్,  కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసి తిరిగి  వెళ్తున్న ఎమ్మెల్యే రామ్మోహన్‌ రెడ్డిని అంబేద్కర్ విగ్రహం దగ్గర   అడ్డుకున్నారు.  వీరిని పోలీసులు, కార్యకర్తలు పక్కకు నెట్టివేయడంతో.. ఎమ్మెల్యే ముందుకు వెళ్లిపోయారు.  అనంతరం బీజేపీ ఎంపీటీసీ కిరణ్ మాట్లాడుతూ దళితబంధు ఇవ్వాలని  అడిగితే ఎమ్మెల్యే  సమాధానం చెప్పకుండా వెళ్లిపోవడం సరికాదన్నారు.