పీఓకేను ఎప్పుడు స్వాధీనం చేస్కుంటరు? : కేంద్రాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్​ ఎంపీ

 పీఓకేను ఎప్పుడు స్వాధీనం చేస్కుంటరు? : కేంద్రాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్​ ఎంపీ

న్యూఢిల్లీ : పాక్‌‌ ఆక్రమిత కాశ్మీర్‌‌(పీఓకే)ను ఎప్పుడు తిరిగి స్వాధీనం చేసుకుంటారని కాంగ్రెస్‌‌ ఎంపీ అధిర్‌‌ రంజన్‌‌ చౌదరి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జమ్మూ కాశ్మీర్‌‌లో ఎన్నికలు నిర్వహించి.. రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్‌‌ చేశారు. సోమవారం పార్లమెంట్ బయట మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టికల్ 370 తాత్కాలిక చర్య అని కాంగ్రెస్ అభిప్రాయమని ఆయన అన్నారు.

“ కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. పార్లమెంట్ లోపల పాక్ ఆక్రమిత కాశ్మీర్‌‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటామని గొప్ప నమ్మకంతో చెబుతున్నారు. కాబట్టి వారు ఎప్పుడు పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకుంటారో మాకు చెప్పాలి. ఎన్నికలు వస్తాయి, పోతాయి కానీ ఈ ఎన్నికలకు ముందు పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకోవాలి..” అని చౌదరి అన్నారు.