HIT 3 OTT: ఓటీటీకి నాని వంద కోట్ల బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

HIT 3 OTT: ఓటీటీకి నాని వంద కోట్ల బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

నాని నటించిన హిట్ 3 (HIT3)మూవీ త్వరలో ఓటీటీకి రానుంది. మే1న థియేటర్స్లో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అందుకుంది. 13 రోజుల్లో రూ.114 కోట్ల వ‌ర‌కు గ్రాస్‌, రూ.73 కోట్ల‌కుపైగా షేర్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

హిట్ 3 రిలీజయ్యాక థియేటర్స్లో పెద్ద చెప్పుకొదగ్గ సినిమాలేవీ రాలేదు. దాంతో ఇంకా కొన్నిచోట్ల రన్ అవుతుంది. ఈ క్రమంలోనే హిట్ 3 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వివరాలు బయటికొచ్చాయి. 

హిట్ 3 ఓటీటీ:

హిట్ 3 ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ మంచి ధరకు సొంతం చేసుకుంది. ఈ సినిమా థియేటర్స్లో రిలీజైన 4 వారాల తర్వాతే స్ట్రీమింగ్ చేసేలా నిర్మాత‌ల‌తో ఓటీటీ ప్లాట్‌ఫామ్ డీల్ సెట్ చేసుకుందని సమాచారం. ఈ మేరకు జూన్ 5న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మే లాస్ట్ వీక్ లోనే హిట్ 3 ఓటీటీ అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది. 

హిట్ 3 మూవీలో అర్జున్ సర్కార్ ఐపీఎస్గా నాని తన విశ్వరూపం చూపించారు. నాని కెరియర్లోనే మునుపెన్నడూ లేని విధంగా ఫుల్ యాక్షన్ తో ఇరగదీశాడు. సినిమా మొత్తం తన వైలెంట్ క్రైమ్ తో స్క్రీన్ పై ఇంటెన్సివ్ యాంగిల్ ప్రదర్శించాడు. ఈ అంశాలతో నాని ఖాతాలో వైల్డ్ ఫ్యాన్స్ కూడా చేరిపోయారు. 

Also Read :  టాలీవుడ్ హీరో ర్యాష్ డ్రైవింగ్

హిట్‌‌‌‌ 3 క్లైమాక్స్‌‌‌‌లో తమిళ స్టార్ హీరో కార్తి కనిపించి సర్‌‌ప్రైజ్ చేశాడు. ఏసీపీ వీరప్పన్‌‌‌‌ పాత్రలో కనిపించిన కార్తి.. ‘హిట్‌‌‌‌’ ఫ్రాంచైజీలో రాబోయే నాలుగు భాగంలో హీరోగా నటించడం దాదాపు కన్‌‌‌‌ఫర్మ్ అయినట్టే. ఈ ఫ్రాంఛైజీలో ఇప్పటి వరకూ నటించిన వాళ్లంతా టాలీవుడ్ హీరోలే. 

హిట్ 1లో విశ్వక్సేన్, హిట్ 2లో అడవి శేష్, హిట్ 3లో నాని నటించారు. ఇపుడు కార్తి ఎంట్రీ విశేషం అని చెప్పుకోవాలి. హిట్ 4 కోసం ఓ మర్డర్ మిస్టరీ కూడా సిద్ధంగా ఉన్నట్లు దర్శకుడు శైలేష్ కొలను, హిట్ 3 చివర్లో కార్తీ ఇంట్రడక్షన్తో కన్ఫామ్ చేశాడు.

కథేంటంటే:

హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీం (HIT)లో ఎస్పీ హోదా ఆఫీసర్ అర్జున్ సర్కార్ (నాని). కాశ్మీర్ నుండి ట్రాన్స్ ఫర్పై విశాఖపట్నం వచ్చిన అర్జున్.. వచ్చి రావడంతోనే రెండు దారుణ హత్యలు చేస్తాడు. అతను చేసిన ఈ రెండు హత్యలు గతంలో తాను పని చేసిన కాశ్మీర్ లోని సైకో పాత్ మర్డర్స్ తరహాలో ఉంటాయి. దేశంలోని 13 చోట్ల ఇదే తరహా సైకో మర్డర్స్ జరుగుతుంటాయి. ఈ హత్యల వెనుక  కాప్చర్ టార్చర్ కిల్ (సి.టి.కె.) అనే డార్క్ వెబ్ సైట్ ఉందని తెలుస్తుంది. సి.టి.కె. కు అర్జున్ సర్కార్కు సంబంధం ఏమిటి.. అతను ఎందుకు మర్డర్స్ చేశాడు.. అతని జీవితంలో మృదుల (శ్రీనిధి శెట్టి) పాత్ర ఏమిటి.. అనేది మిగతా కథ.