సీఎం వస్తే మంత్రులు ఆహ్వానించాలని  ఏ రాజ్యాంగంలో ఉంది? : రఘునందన్‌‌‌‌రావు ప్రశ్న

సీఎం వస్తే మంత్రులు ఆహ్వానించాలని  ఏ రాజ్యాంగంలో ఉంది? : రఘునందన్‌‌‌‌రావు ప్రశ్న

సిద్దిపేట రూరల్, వెలుగు: ‘ప్రధాన మంత్రి వస్తే సీ ఎం వచ్చి ఆహ్వానం పలకాలని ఎక్కడైనా ఉందా? ఏ రాజ్యాంగంలో ఉంది?’ అని అడిగిన మంత్రి.. మరి సీఎం వస్తే మంత్రులు, అధికారులు రావాలని ఏ రాజ్యాంగంలో ఉందో చెప్పాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు.

ఆదివారం సిద్దిపేటలోని బీజేపీ జిల్లా ఆఫీసులో మీడి యాతో ఆయన మాట్లాడారు. ప్రశాంత్ కిషోర్ లాంటి కొంత మంది ఇచ్చిన సలహాలతో బీఆర్ఎస్ పార్టీ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో రాజకీయాలను కలుషితం చేస్తున్నదని ఆరోపించారు.

దేశంలో అన్ని రాష్ట్రాల అభివృద్ధి జరిగాలన్నదే మోడీ ఆలోచన అని చెప్పారు. అందులో భాగంగానే తెలంగాణలో దాదాపు రూ.12 వేల కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారని తెలిపారు. ప్రతిపక్షం, అధికార పక్షం అని కాకుండా సీఎం కేసీఆర్ ని, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌‌‌‌కు ఆహ్వానం పంపినా వారు రాలేదని విమర్శించారు.

కేంద్రం ఇస్తేనే సిద్దిపేటకు రైలొచ్చింది.. 

కేంద్రం ఇస్తేనే సిద్దిపేటకు రైలు వచ్చిందని రఘునందన్‌‌‌‌రావు అన్నారు. ‘‘దుబ్బాకకు ఎలాంటి నిధులు రాకుండా అడ్డుకుంటూ విషం చిమ్ముతున్నారు. దుబ్బాకకు వచ్చే సీడీఎఫ్ నిధులు జిల్లా మంత్రి మళ్లించు కున్నాడు. సిద్దిపేట కోమటి చెరువు ఇచ్చే నిధుల్లో 10% దుబ్బాకకు ఇచ్చినా బాగుండేది” అని రఘునందన్‌‌‌‌రావు  అన్నారు.