
మానవుడు ఏ రోజు ఏం చేయాలి? .. ఏ రోజు.. ఏం చేస్తే పుణ్యఫలితం దక్కుతుంది. ఏ రోజు ఏం కార్యాలు చేయాలి..? ఏ దేవున్ని పూజించాలి..? ఈ విషయాలు నిత్యం అందరికి అవసరమే. శాస్త్రాలు.. పురాణాల్లో ఏముందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. .
ఏ రోజు ఏ దేవుడికి పూజ చేస్తే ఎలాంటి పుణ్యఫలితం దక్కుతుందో శివ మహా పురాణం విద్యేశ్వర సంహిత 14వ అధ్యాయం వివరించింది. దేవతల ప్రీతి కోసం 5 విధాలైన పూజ ఏర్పడింది. మంత్రాలతో ..
- జపం
- హోమం
- దానం
- తపస్సు
- సమారాధన అనేవి 5 విధాలైన పూజలు ఉన్నాయని పురాణాల ద్వారా తెలుస్తుంది.
సమారాధనం అంటే దేవుడిని ఉంచే వేదిక.. ప్రతిమ... అగ్ని.. బ్రాహ్మణుడిని షోడశోపచారాలతో పూజించటం.. ఈ 4 రకాలలో ఒక దానికంటే ఒకటి ఉత్తమమైనది. ఇక పూజల విషయంలో ఆదివారం నుంచి శనివారం వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతకు చేయాల్సి ఉంటుందని పండితులు చెబుతునారు.
ALSO READ : దీపావళి అక్టోబర్ 20 నా.. 21 నా..
ఆదివారం చేయాల్సిన పూజలు....
ఆదివారం ఆదిత్యుడిని ( సూర్యుడిని) , ఇతర దేవతలను, వేద పండితులను పూజించాలి.
ఆదిత్య పూజ వల్ల నేత్ర వ్యాధులు, శిరోరోగం, కుష్ఠువ్యాధి తగ్గుతాయి.
ఆదిత్యుడిని పూజించి వేద పండితులకు భోజనం పెట్టాలి.
ఇలారోగ తీవ్రతనను బట్టి ఒక రోజు నుంచి ఒక మాసం... ఒక సంవత్సరం లేక 3 సంవత్సరాల పాటు పూజ చేయాలి.
దీనివల్ల సూర్యానుగ్రహప్రాప్తి కలుగుతుంది.
సోమవారం చేయాల్సిన పూజలు.....
సోమవారం లక్ష్మీదేవిని ఆరాధించాలి. పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయాలి.
ఆ రోజున పూజ తర్వాత వేద పండిత దంపతులకు నెయ్యితో భోజనం పెట్టాలి.
శివుడిని పూజించి.. శివాలయాలను సందర్శించాలి.
కొంతమంది సోమవారం ఉపవాస దీక్షను పాటిస్తారు.
సంతాన సమస్యతో బాధపడే వారు సోమవారం శివుడిని పూజించి.. ఉపవాస దీక్షను పాటిస్తే .. తప్పకుండా సంతానం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.
మంగళవారం చేయాల్సిన పూజలు....
ఆరోగ్య సమస్యలు తగ్గేందుకు మంగళవారం కాళీ దేవతను.. ఆంజనేయస్వామిని పూజించాలి.
మినుము, కంది, పెసరపప్పులతో చేసిన పదార్థాలతో వేద పండితులకు భోజనం పెట్టాలి.
దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారు హనుమంతుడికి ఆకుపూజ చేయాలి.
సుందరాకాండ పారాయణం చేయాలి.. లేదా శ్రద్దగా వినాలి.
కోర్టు వివాదాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి.
బుధవారం చేయాల్సిన పూజలు....
బుధవారం రోజు పెరుగు అన్నాన్ని విష్ణు దేవునికి నివేదించాలి. గణపతిని పూజించాలి.
ఈ నివేదనల వల్ల పూజ చేసిన వారి కుమారులు, మిత్రులు, భార్య తదితరులకు చక్కటి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది.
వినాయకుడిని గరికతో పూజించాలి. తీపి పదార్ధాలను నైవేద్యంగా సమర్పించి పేదలకు పంచిపెట్టాలి.
ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి.
వినాయకుడికి ఉండ్రాళ్లు సమర్పించాలి. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు పరిష్కారమవుతాయి.
పనుల్లో ఎదురయ్యే ఆటంకాలు తొలగుతాయి.
అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
బ్రాహ్మణులకు వస్త్రదానంతో పాటు దక్షిణ తాంబూలం ఇచ్చి సత్కరించాలి.
గురువారం చేయాల్సిన పూజలు...
ఆయుష్షును, ఆరోగ్యాన్ని కోరేవారు తమ ఇష్టదైవానికి.. కుల దైవానికి .. గురువారం రోజున పాలతో, నెయ్యితో చేసిన పదార్థాలను నివేదించాలి.
వస్త్రాలను కూడా సమర్పించి అర్చన చేయడం కూడా శుభకరం.
నవగ్రహాల్లో గురుడిని పూజించాలి. జాతకంలో దోషాలు తొలగిపోతాయి.
గురువు బలం అనుకూలంగా ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
శివాలయంలో నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలి.
శుక్రవారం చేయాల్సిన పూజలు...
శుక్రవారం రోజు కూడా ఇష్టదైవంతో పాటు అమ్మవారిని శ్రద్ధతో ఆరాధించాలి.
పూజానంతరం వేదపండితుల తృప్తి కోసం షడ్రుచులతో కూడిన భోజనాన్ని పెట్టాలి.
స్త్రీల తృప్తి కోసం మంచి మంచి వస్త్రాలను బహూకరించడం మంచిదని పండితులు చెబుతున్నారు.
అమ్మవారి ఆలయాల్లో కుంకుమపూజ చేయాలి. లక్ష్మీ దేవిని ఆరాధించాలి.
అభివృద్దిలో కలిగే ఆటంకాలు తొలగిపోతాయి.
లలితా సహస్రనామం పఠించాలి.. లేదా శ్రద్దగా వినాలి.
అమ్మవారికి ఎరుపు లేదా.. ఆకుపచ్చ రంగు చీర సమర్పించాలి.
ముత్తయిదవులకు పువ్వు.. పండు.. తాంబూలం ఇవ్వాలి.
శనివారం చేయాల్సిన పూజలు...
శనివారాల్లో కొన్ని ప్రత్యేకమైన మంత్రాలను పాటించడం ద్వారా శనితో పాటు రాహు కేతువులకు పూజ చేసి వారి అనుగ్రహం పొందవచ్చు.
ఓం శనైశ్ఛరాయై రాయే నమః అనే మంత్రాన్ని పఠించడం ద్వారా శని దేవుడు అనుగ్రహాన్ని పొందుతారని పండితులు చెబుతున్నారు.
శివాలయం శని దేవుడికి తైలాభిషేకం చేసి నల్ల నువ్వులు.. బెల్లం సమర్పించాలి.
ఆవును నందిగా భావించి బెల్లం, శనగపిండి తినిపించండి.
వెంకటేశ్వరస్వామి ఆలయాలను ప్రదోషకాలంలో దర్శించండి.
విష్ణుసహస్రనామం పఠించండి లేదా వినండి
అన్ని రకాల బాధల నుంచి విముక్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారంతో పాటు ఆధ్యాత్మిక గ్రంథాల నుంచి సేకరించిన సమాచారం మేరకు రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించేదు. మీకున్న సమస్యలకు వేద పండితులను సంప్రదించటం ఉత్తమం.