
జ్యోతిష్య, వాస్తుశాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ మొక్క... ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి స్థిరంగాఉంటుందని.. ఐశ్వర్యం అభివృద్ది కలుగుతుందని నమ్ముతుంటారు. అయితే ఈ మొక్కను కొంతమంది మట్టి కుండీలోనూ.. మరి కొంతమంది గాజు వస్తువుల్లో పెట్టుకుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ మొక్కను ఎందులో నాటాలి.. అది ఇంట్లో ఏదిశలో పెంచుకోవాలో తెలుసుకుందాం. . .
గాజు సీసాలో మనీ ప్లాంట్ నాటడం
జ్యోతిష్య, వాస్తు నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం గాజు సీసాలో మనీ ప్లాంట్ మొక్కను నాటడం చాలా మంచిదని చెబుతున్నారు పండితులు. ఇలా చేయడం వలన ఇంట్లోకి పాజిటివ్ పవర్ వస్తుందని చెబుతున్నారు. మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో ఉంటే ఐశ్వర్యం కలిగి... ఆర్థిక ఇబ్బందులు కలగవని చెబుతున్నారు. ఇంకా ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి.. ఆనందం.. శాంతి నెలకొంటుంది
మనీ ప్లాంట్‌ను ఈశాన్యం లేదాఆగ్నేయ దిశలో ఉంచడం వల్ల సంపద పెరుగుతుంది. ఈ మొక్కను మట్టిలో కంటే నీటిలో పెంచడం చాలా సులభంగా ఉంటుంది. నీటిలో ఈ మొక్క చాలా తొందరగా పెరుగుతుంది. అందుకే చాలా మంది గాజు వస్తువుల్లో నీరు పోసి మనీ ప్లాంట్ మొక్కను పెంచుకుంటారు. మనీ ప్లాంట్ గాజులో సీసాలో ఎంతో అందంగా ఉంటుంది.