Vastu Tips : చెత్తబుట్ట​ ఇంట్లో ఎక్కడ ఉండాలి

Vastu Tips : చెత్తబుట్ట​ ఇంట్లో ఎక్కడ ఉండాలి

ఇల్లు నిర్మించుకొనేటప్పుడు ఏ గది ఎక్కడ ఉండాలి.. బెడ్​ రూం.. కిచెన్​.. హాల్​.. ఇలా అన్ని గదుల విషయంలో  వాస్తు నిపుణులను సంప్రదిస్తాం.  అయితే ఇంట్లో చెత్త డబ్బా( Distbin)ను కూడా ఉంచేందుకు వాస్తును అనుసరించాలని వాస్తు సిద్దాంతి .. వాస్తు కన్సల్టెంట్​ కాశీనాథుని శ్రీనివాస్​ అంటున్నారు.  వాస్తు ప్రకారం ఇంట్లో డస్ట్​ బిన్​ ఎక్కడ ఉండాలో తెలుసుకుందాం..

ప్రశ్న: జనాలు చాలా మంది అపార్ట్​ మెంట్​ కల్చర్​ కు అలవాటుపట్టారు.  అలా ఉంటున్నప్పుడుప్రతి అంగుళాన్ని కూడా ఉపయోగించుకోవాలి.  లేదంటే  స్పేస్​ సరిపోక ఇబ్బందులు పడే అవకాశం ఉంది.  మరి చెత్తబుట్టను  గుమ్మానికి ఎదురుగా చెత్త డబ్బా పెట్టుకుంటే. ఏమైనా సమస్యలు వస్తాయా? ఇంటికి ఎటువైపు పెట్టుకుంటే బాగుంటుంది. 

జవాబు : గుమ్మానికి ఎదురుగా చెత్త డబ్బా పెట్టుకోవడం అంత మంచిది కాదు. చెత్త డబ్బా అనే కాదు. గుమ్మానికి ఎటువంటి అడ్డంకులు ఉన్నా సమస్యలే వస్తాయి. మెయిన్ డోర్ ముందు స్తంభాలు, చెట్లు లాంటివి కూడా ఉండకూడదు. చెత్తడబ్బాను ఇంటికి ఆగ్నేయంలో పెట్టుకుంటే మంచిది.