న్యూస్ చదువుతుండగా బాంబుల మోత.. యాంకర్ పరుగో పరగు.. ఇజ్రాయెల్ దాడులకు సిరియా విలవిల !

న్యూస్ చదువుతుండగా బాంబుల మోత.. యాంకర్ పరుగో పరగు.. ఇజ్రాయెల్ దాడులకు  సిరియా విలవిల !

పశ్చిమాసియాలో పొరుగు దేశాలకు చుక్కలు చూపిస్తోంది ఇజ్రాయెల్. నిన్నమొన్నటి దాకా ఇరాన్ తో భీకర యుద్ధం చేసి కాస్త శాంతించినట్లు కనబడిన ఇజ్రాయెల్.. ఇప్పుడు మళ్లీ సిరియాపై డైరెక్ట్ అటాక్ చేసింది. ఏకంగా ప్రసిడెన్షియల్ ప్యాలస్ (అధ్యక్ష భవనం) సమీపంలో బాంబులతో విరుచుకుపడింది. సిరియా మిలిటరీ హెడ్ క్వార్టర్స్, రక్షణ శాఖ మంత్రి భవన సముదాయాలకు సమీపంలో బాంబులు వేయడం సిరియాను భయాందోళనకు గురిచేసింది. 

సౌత్ సిరియాలో ద్రూజ్ (Druze) పౌరులపై సిరియా ప్రభుత్వ చర్యలకు ప్రతిస్పందనగా దాడులకు దిగినట్లు ఇజ్రాయెల్ రక్షణ బలగాలు (IDF) ప్రకటించాయి. మరోవైపు సిరాయా రాజధాని డమాస్కస్ పై చేసిన మిస్సైల్ దాడులు విధ్వంసాన్ని సృష్టించాయి. మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టార్గెట్ గా దాడులకు దిగింది. ద్రూజ్ ప్రజలను రక్షించుకునేందుకే దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. 

న్యూస్ చదువుతుండగా బ్లాస్ట్.. యాంకర్ పరుగులు:

ఇజ్రాయెల్ బాంబులకు సిరియా క్యాపిటల్ సిటీ డమాస్కస్ దద్ధరిల్లింది. అయితే ఒక యాంకర్ న్యూస్ రూమ్ లో వార్తలు చదువుతుండగా.. పెద్ద ఎత్తున వరుస బాంబులు పేలాయి. ఆ శబ్దానికి న్యూస్ చదవడం వదిలేసి యాంకర్ పరుగులు పెట్టడం కింద వీడియోలో చూడవచ్చు. 

డమాస్కస్ కు వార్నింగ్స్ అయిపోయాయి.. ఇక నుంచి దారుణమైన విధ్వంసం ఉంటుందని ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ కట్జ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దక్షిణ సిరియా ప్రాంతంలో జరుగుతన్న అంతర్యుద్ధం విషయంలో ఇటీవలే ఇజ్రాయెల్ జోక్యం చేసుకుంది. ద్రూజ్ ప్రజలకు రక్షణ కల్పిస్తామని.. వారిపై దాడులకు దిగితే సిరియాను భస్మం చేస్తామని హెచ్చరించింది. సిరియాలో ఉన్న ద్రూజ్ ప్రజలను ఇజ్రాయెల్ కాపాడుతుందని ఇజ్రాయెల్ ద్రూజ్ నమ్ముతున్నారని.. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వాళ్లను కాపాడుతామని చెప్పింది.