వాళ్లు చనిపోయిన ప్రాంతం చాలా బీభత్సంగా ఉంది

వాళ్లు చనిపోయిన ప్రాంతం చాలా బీభత్సంగా ఉంది

ఆ ఇన్ఫర్మేషన్​ అందిన వెంటనే పోలీసులు అక్కడికి వచ్చి చుట్టుపక్కలంతా వెతికారు. బయట ఎక్కడా అనుమానాస్పదంగా ఏమీ​ కనిపించలేదు. ఇలాగైతే లాభం లేదని ఇళ్లల్లో వెతకడం మొదలుపెట్టారు. అప్పుడు కానీ అసలు విషయం బయటపడలేదు. కాస్త దూరంగా ఉన్న ఒక ఇంటి పరిసర ప్రాంతాల్లోకి వెళ్లగానే ముక్కుపుటాలు అదిరిపోయే దుర్వాసన. దాంతో అక్కడే ఏదో జరిగిందని డిసైడ్​ అయ్యారు పోలీసులు. వెంటనే ముక్కులకి మాస్క్​లు కాస్త గట్టిగా బిగించుకున్న ఒక టీం ఆ ఇంటిలోకి వెళ్లింది. 

లోపలికి వెళ్లిన వాళ్లకి హాల్లో ఏమీ దొరకలేదు. అలానే వెతుకుతూ బెడ్​రూమ్​లోకి వెళ్లారు. అక్కడ రెండు డెడ్​బాడీస్​ కనిపించాయి. అందులో ఒకరు ఆడ, మరొకరు మగ. ఆ ఇద్దరూ చనిపోయి చాలా రోజులే అయి ఉంటుంది అనుకున్నాడు ఆ టీంని లీడ్​ చేస్తున్న ఆఫీసర్. వాళ్లకు సంబంధించిన వివరాల కోసం చుట్టుపక్కల వాళ్లని ఆరా తీశారు పోలీసులు. చనిపోయిన ఇద్దరిలో ఆమె పేరు మేడమ్​ మే ప్రెస్కాట్​, అతని పేరు  ఫ్రెడ్ అని తెలిసింది​. 

వాళ్లిద్దరూ భార్యాభర్తలు.

వాళ్లు చనిపోయిన ప్రాంతం చాలా బీభత్సంగా ఉంది. డెడ్​ బాడీస్​ పడున్న ప్లేస్​కి కొద్ది దూరంలో ఉన్న రక్తపు మరకలను చెరిపేసేందుకు కాబోలు అక్కడ మంట పెట్టారు. అక్కడంతా మసి ఉంది. క్లూస్​ కోసం వెతుకుతుంటే వాళ్లకి ఒక పేపర్​ ముక్క  కనిపించింది. అందులో – ‘‘నాకు, మేకి మధ్య భయంకరమైన గొడవ అయ్యింది. ఆవేశంలో మేని చంపేశాను” అని రాసి ఉంది. అది చదివిన తరువాత బహుశా మేని చంపేసి, ఫ్రెడ్​ రాసి ఉంటాడు. ఆ తరువాత పశ్చాత్తాపంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడు అనుకున్నారు. కానీ క్రైం సీన్​ చూస్తే ఆ స్లిప్​లో రాసిన దానికి పొంతన లేదు.
ఫ్రెడ్​ గొంతు మీద ఎడాపెడా చేతికొచ్చినట్టు కోసినట్టు ఉంది. ఇంకొక్క వేటు పడినా తల, మొండెం వేరైపోయేవి. తలకు ఒక పక్క చెవి నుంచి అవతలి పక్క చెవి వరకు విపరీతంగా గాయాలు. గన్​తో తలలోకి కాల్చిన తాలూకు బుల్లెట్​ గాయాలు. శరీరం, వీపు మీద లెక్కలేనన్ని కత్తి గాట్లు ఉన్నాయి. ఫ్రెడ్​ చేతిలో గన్​ పట్టుకున్నట్టు ఉంది. ఫ్రెడ్​ డెడ్​బాడీ పరిస్థితి అదయితే..  మేడమ్​ మే గొంతు కోసిన గాయాలు కనిపించాయి. తుపాకీతో  రెండు సార్లు కాల్చిన గాయాలు ఉన్నాయి. ఆ రూమ్​ మొత్తం వెతికితే పోలీసులకు ఒక బుల్లెట్​ దొరికింది. మర్డర్​– సూసైడ్స్​ జరుగుతూనే ఉంటాయి. కాబట్టి పోలీసులు ఈ కేసు విషయంలో మొదట అనుమానించలేదు. కానీ క్రైం సీన్​లో ఒక విషయం మరొక విషయం పోలుస్తుంటే మాత్రం అనుమానాస్పదంగా అనిపించింది. ఆత్మహత్యే అయితే ఫ్రెడ్​ గొంతును తనకు తనే అలా ఎలా కోసుకున్నాడు?  ఒకవేళ తుపాకీతో కాల్చుకుని ఉంటే ఆ తరువాత గొంతు  కోసుకోలేడు కదా? బెడ్​రూమ్​కి నిప్పు ఎవరు పెట్టారు? ఒకవేళ ఆ ఇద్దరూ గొడవ పడి మర్డర్​–సూసైడ్​ జరిగి ఉంటే ఆ ఇద్దరూ చనిపోయారు కదా? మంట ఎలా పెడతారు? ఫ్రెడ్​ నోట్​ చదివాక ఇన్వెస్టిగేషన్​ ఆఫీసర్​ బుర్రలో ఎన్నో అనుమానాలు. దీని వెనక ఇంకా ఏదో ఉందనిపించింది. 

మరింత లోతుగా విచారణ మొదలుపెట్టారు. మే... వర్కింగ్​ గర్ల్స్​ డెన్​కు మేడమ్​గా పనిచేసేది. అందుకే ఆమెను అంతా మేడమ్​ మే అని పిలిచేవారు కాబోలు. ఆ విషయం ఈ కేసులో ఏ విధంగానూ అక్కరకు రాలేదు. ఒకవేళ వెస్టర్న్​ టౌన్​ అండర్​ వరల్డ్​ మాఫియా దీని వెనక ఉందా అని కూడా ఆలోచించారు. నెల రోజులకి పైనే పరిశోధించారు. కానీ కేసు సాల్వ్​ కాలేదు. ఆ తరువాత కొన్ని వారాల పాటు ఎందరినో విచారించారు. ఆ తరువాత కేసును గ్రాండ్ జ్యూరీ ముందు పెట్టారు. ఇన్వెస్టిగేషన్​ ఆఫీసర్లు అనుమానించిన దానికి ఇంకొన్ని అనుమానాలు జోడించింది ఆ జ్యూరీ. 
ఎన్నో విధాలుగా పరిశీలించాక ఆ జంటను గుర్తు తెలియని పార్టీ లేదా పార్టీలు హత్య చేసి ఉంటాయనే కన్​క్లూజన్​కు వచ్చారు. అంతేకానీ కేసు మాత్రం  పరిష్కారం కాలేదు. వారాల తరబడి రకరకాల ఎవిడెన్స్​లు సేకరించారు. పరిష్కారం కాని ఈ కేసుకు సంబంధించిన ఆ​ ఇల్లు ఇప్పటికీ గ్రాండ్​ కెన్యన్​ ఇంటర్నేషనల్​ యూత్​ హోటల్​కి ముందువైపు ఉంటుంది. దీన్ని ఫ్లాగ్​స్టాఫ్​ డౌన్​టౌన్​ హంటెడ్​ లొకేషన్స్​లో లిస్ట్​ కూడా చేయలేదు. ఈ హత్యల గురించి ఒక పుస్తకం కూడా వచ్చింది. ఎలాంగ్​ రూట్​ 66 అనే ఆ పుస్తకం ప్రకారం... హత్యలు జరిగిన కొద్ది కాలంలోనే ఆ ఇంటిని కె జె నకర్డ్​ కొనుక్కున్నాడు. అందులోనే ఉన్నాడు. దాని చుట్టూ డౌన్​టౌనర్​ ఆటో కోర్టు కూడా కట్టాడు. ఇప్పటికీ ఆ హత్యలు ఎందుకు జరిగాయనేది మాత్రం అంతుచిక్కని మిస్టరీనే!