
- కక్ష సాధింపులు వద్దనే కేసును సీబీఐకి ఇచ్చాం: విప్ ఆది శ్రీనివాస్
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితనే తేల్చి చెప్పారని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి వ్యవహారంలో ఎమ్మెల్యే హరీశ్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావుకు సంబంధం ఉందన్న కవిత వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఇంతకాలం కాంగ్రెస్ చేసిన ఆరోపణలు ఇప్పుడు ఆమె నోటి నుంచే వచ్చాయన్నారు.
కేసీఆర్ కుటుంబానికి కామధేనువుగా మారిందన్న తమ ఆరోపణలను కవిత ఏకీభవించారన్నారు. ఈ మాటలు ఆనాడే ఆమె చెప్పి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు. కాళేశ్వరం అవినీతి విషయంలో రాజకీయ కక్షసాధింపు చర్యలకు తావివ్వకూడదనే సీబీఐకి అప్పగించామని ఆయన తెలిపారు.