- నిన్ను జనం ఛీ కొడ్తున్నరు: విప్ ఆది శ్రీనివాస్
హైదరాబాద్, వెలుగు: ‘కేటీఆర్.. నువ్వు నోరు మూసుకుంటేనే తెలంగాణలో కొంతకాలమైనా బీఆర్ఎస్ పార్టీ బతుకుతుంది’అని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో, ఆ తర్వాత జరిగిన కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వరుస ఓటములు ఎదురైనా కేటీఆర్‌కు మాత్రం సిగ్గు శరం రావడం లేదని శనివారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.
నీ బతుకు, నీ పార్టీ బతుకు మీ సొంత చెల్లి కవిత చెప్తుంది.. ముందు అది చక్కదిద్దుకో అని హితవు పలికారు. వరుస ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను చిత్తుచిత్తుగా ఓడించినా.. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు మరిచి కేటీఆర్ వ్యవహరిస్తున్న తీరుకు జనం ఛీ కొడుతున్నారన్నారు. జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్‌ను చిత్తుగా ఓడించినా కేటీఆర్ ఇంకా బలుపు మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. చైతన్యవంతులైన తెలంగాణ సమాజం ముందు నీ జమ్మిక్కులు సాగవని హెచ్చరించారు.
