సూపర్ మాన్గా ట్రంప్.. ఏఐ ఇమేజ్తో మరోసారి ట్రోలింగ్

సూపర్ మాన్గా ట్రంప్.. ఏఐ ఇమేజ్తో మరోసారి ట్రోలింగ్

రెండు నెలల కిందట తనను తాను పోప్​గా పేర్కొంటూ ఏఐ ఇమేజ్ క్రియేట్ చేసుకుని అభాసుపాలైన ట్రంప్.. తాజాగా సూపర్ మాన్ అవతార్ ఏఐ ఇమేజ్​తో మరోసారి ట్రోలింగ్​కు గురవుతున్నారు. గత మే నెలలో పోప్ లియో ఎన్నికకు ముందుగా ట్రంప్ స్వయంగా తాను పోప్ రూపంలో ఉన్నట్టుగా ఏఐ ఇమేజ్​ను ట్రూత్​ సోషల్​లో పోస్ట్ చేయగా.. నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. దీంతో అది జస్ట్ సరదాగా చేశానంటూ ట్రంప్ సమర్థించుకున్నారు. 

తాజాగా సూపర్ మాన్ సినిమా విడుదల సందర్భంగా అమెరికా అధ్యక్ష భవనం (వైట్ హౌస్) ట్రంప్​ను సూపర్ మాన్ రూపంలో క్రియేట్ చేసిన ఏఐ ఇమేజ్​ను ఎక్స్​లో పోస్ట్ చేసింది. ‘‘అమెరికన్ల ఆశ, న్యాయం, మార్గానికి ప్రెసిడెంట్ ట్రంప్ ఒక సింబల్” అంటూ ఈ ఫొటోకు క్యాప్షన్ పెట్టింది. దీంతో నెటిజన్లు వైట్ హౌస్ తీరుపై మండిపడుతున్నారు. వైట్ హౌస్ ఇలా ఒక జోక్ హౌస్​గా మారిపోతుందని అనుకోలేదు.. ట్రంప్ న్యాయాని కి, ఆశకు ప్రతీక కాదు.. ఆయన చైల్డ్ సెక్స్ అఫెండర్ జెఫ్రీ ఎప్ స్టీన్ కు ప్రతీక అంటూ విమర్శిస్తున్నారు.