కుటుంబ విలువలతో తెల్ల కాగితం

కుటుంబ విలువలతో తెల్ల కాగితం

‘కోర్ట్‌‌‌‌’ ఫేమ్ హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా  నటించిన  యూత్‌‌‌‌ఫుల్ ఎంటర్‌‌‌‌టైనర్ ‘తెల్ల కాగితం’.  రమేష్ బండ్రెడ్డి దర్శకత్వంలో  కృష్ణ కొమ్మాలపాటి నిర్మించారు. అక్టోబర్ 2న సినిమా విడుదలవుతోంది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌ను నిర్వహించారు. నిర్మాతలు దిల్ రాజు, బండ్ల గణేష్, దర్శకులు  అనిల్ రావిపూడి, కొరటాల శివ, చందు మొండేటి, వశిష్ట, శైలేష్ కొలను, రామ్ జగదీష్ అతిథులుగా హాజరై ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరారు.

ఈ సందర్భంగా  హీరో హర్ష్ రోషన్ మాట్లాడుతూ.. లీకైన వీడియోను చూసి సినిమాపై అభిప్రాయం ఏర్పరచుకోవద్దని, పూర్తి సినిమా చూసిన తర్వాత ప్రేక్షకుల ఆలోచన మారుతుందని అన్నాడు.  దర్శకుడు రమేష్ మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో  ఎలాంటి వివాదాస్పద అంశాలు లేవని, కుటుంబం గర్వపడేలా సినిమాను తెరకెక్కించాం’ అని చెప్పాడు.  ఇది కేవలం ప్రేమకథ కాదని, తల్లిదండ్రుల త్యాగాలు, కుటుంబ విలువలను చూపించే కథ అని రచయిత నందు సవిరిగాన అన్నాడు. హీరోయిన్ నక్షత్ర సహా టీమ్ అంతా కార్యక్రమంలో పాల్గొన్నారు.