వైర‌స్ నియంత్ర‌ణ‌కై కేటాయించిన నిధుల వివ‌రాలు తెల‌పాలి

వైర‌స్ నియంత్ర‌ణ‌కై కేటాయించిన నిధుల వివ‌రాలు తెల‌పాలి

 సీఎం కేసీఆర్‌కు బండి సంజ‌య్ లేఖ‌

క‌రోనా వైర‌స్ క‌ట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రానికి కేటాయించిన నిధుల వివరాలు తెల‌పాలంటూ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు, ఎంపీ బండి సంజ‌య్ ముఖ్యమంత్రి కేసిఆర్ కు లేఖ రాశారు. ఆ లేఖ‌లో… ” ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారు 20వ తారీఖు (సోమ‌వారం)న మీకు ఫోన్ చేసినట్లుగా తెలిసింది. కరోనా నియంత్రణ కోసం మీరు100 కోట్ల రూపాయలను కేటాయించినట్లుగా ప్రధాన మంత్రి మోడీ గారికి మీరు చెప్పినట్లుగా పత్రికల్లో చదివాను. అంతకు ముందు మీరు 1000 కోట్లు కేటాయిస్తామని అసెంబ్లీ వేదికగా ప్రజలకు చెప్పారు. ఈ క్ర‌మంలో కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు, వాటి ఎక్క‌డ‌, ఏ విధంగా ఖర్చు చేశార‌నే విష‌యాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి(CMRF)కి వచ్చిన నిధుల వివరాలను కూడా ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నార‌ని ఎంపీ పేర్కొన్నారు.