క‌రోనా అంతం అవ్వ‌డానికి రెండేళ్లు స‌మ‌యం ప‌ట్టొచ్చు కానీ

క‌రోనా అంతం అవ్వ‌డానికి రెండేళ్లు స‌మ‌యం ప‌ట్టొచ్చు కానీ

క‌రోనా వైర‌స్ పూర్తిస్థాయిలో క‌నుమ‌రుగు అయ్యేందుకు రెండేళ్ల స‌మ‌యం ప‌ట్టొచ్చ‌ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

వ‌ర్చువ‌ల్ మీడియా స‌మావేశంలో టెడ్రోస్ మాట్లాడుతూ 1918 నాటి స్పానిష్ ఫ్లూను అధిగమించేందుకు రెండు సంవ‌త్స‌రాల స‌మ‌యం ప‌ట్టింద‌ని, అయితే నేటి టెక్నాల‌జీని ఉప‌యోగిస్తూ క‌రోనా వైర‌స్ ను త‌క్కువ స‌మ‌యంలో అరిక‌ట్టే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు.

వాస్తవానికి కనెక్టివిటీతో వైరస్ వ్యాప్తి చెందడానికి అవ‌కాశం ఉంద‌ని..అదే స‌మ‌యంలో వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు టెక్నాల‌జీ ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.

ఈ సంద‌ర్భంగా పీపీఈకిట్ల‌లో అవినీతి జ‌రుగుతుందంటూ ప్ర‌శ్నించిన మీడియా మిత్రుల‌కు స‌మాధానంగా..టెడ్రోస్..పీపీఈ కిట్ల‌లో అవినీతి హ‌త్య‌తో
స‌మానం అని అన్నారు. ఎందుకంటే పీపీఈ కిట్లు లేకుండా క‌రోనా వారియ‌ర్స్ విధులు నిర్వ‌హించ‌డం అంటే వారి ప్రాణాల్ని ఫ‌ణంగా పెట్టిన‌ట్లేన‌న్నారు.