భారత్‌కు థ్యాంక్స్ చెప్పిన డబ్ల్యూహెచ్‌వో

భారత్‌కు థ్యాంక్స్ చెప్పిన డబ్ల్యూహెచ్‌వో

జెనీవా: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రియేసస్ భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కరోనా వ్యాక్సిన్ కొరతతో ఇబ్బంది పడుతున్న దేశాలకు టీకాలు పంపిస్తున్నందుకు గానూ ఇండియాకు ఆయన థ్యాంక్స్ చెప్పారు. ‘వచ్చే అక్టోబర్ నుంచి కరోనా వ్యాక్సిన్‌ల షిప్‌మెంట్‌ను తిరిగి ప్రారంభిస్తున్నందుకు ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయకు కృతజ్ఞతలు. ఈ ఏడాది ఆఖరుకు అన్ని దేశాలు 40 శాతం వ్యాక్సినేషన్‌ను సాధించాలని పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంలో భారత్ సాయం చాలా కీలకం కాబోతోంది’ అని గెబ్రియేసస్ ట్వీట్ చేశారు.